
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Reserves: ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ యుగంలో నడుస్తుంది. ఏ చిన్న పేమెంట్ అయినా డిజిటల్ రూపంలోనే చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ పేమెంట్, క్రిప్టో కరెన్సీలు, అత్యాధనిక ఫైనాన్షియల్ మార్కెట్లు ఎంత దూసుకుపోతున్నప్పటికీ ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు మాత్రం మళ్లీ పాతకాలం నాటి బంగారం వైపే మొగ్గు చూపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆర్థికఅనిశ్చితి, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి రక్షణ పొందెందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ బంగారం నిలువలను భారీగా పెంచుకుంటున్నాయి. అయితే తాజాగా విడుదలైన గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిలువలు ఉన్న దేశంగా అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుందని చెప్పాలి. అమెరికా వద్ద ఏకంగా 81 వేల33 టన్నుల బంగారం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నిలువలు ఎంత భారీ స్థాయి అంటే రెండో స్థానంలో ఉన్న జర్మనీ కంటే ఇవి రెండింతలు ఎక్కువ అని చెప్పాలి. అంతేకాదు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఉమ్మడి నిల్వలను కలిపిన అమెరికా గోల్డ్ రిజర్వ తో సమానం అవుతాయి. అయితే ప్రస్తుతం అమెరికా, యూరాప్ దేశాల వద్ద ప్రపంచంలోనే మొత్తం బంగారం నిలువలో 60 శాతానికి పైగా ఉండటం గమనార్హమని చెప్పాలి
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అత్యధికంగా బంగారం నిలువలు ఉన్న ఆరు దేశాల వివరాలు చూస్తే మొదట అమెరికా, రెండవది జర్మనీ, మూడవది ఇటలీ, నాలుగోది ఫ్రెంచ్ ఐదోవది రష్యా- చైనా అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చైనా బంగారం నిలువలను పెంచడంపై గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేక చర్చ మొదలైంది. 2019 నుండి 2024 మధ్యకాలంలో చైనా ఏకంగా 330 టన్నుల బంగారాన్ని అదనంగా కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనాతో పాటు టర్కీ దేశాలు కూడా నిల్వలను పెంచుకునేందుకు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
అయితే ఈ ప్రపంచ ర్యాగింగ్స్ లో భారతదేశం ఒక కీలకమైన ప్లేయర్ గా అవతరించిందని చెప్పాలి. ప్రస్తుతం భారత సెంట్రల్ బ్యాంకు వద్ద 876.2 టన్నుల బంగారం నిలువలు ఉన్నాయని చెప్పాలి. ఈ భారీ నిలువలతో భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్ ముందంజలో ఉండడం విశేషమని చెప్పాలి. సాంప్రదాయ కరెన్సీ ఆస్తులపై ఆధారపడటాన్ని.. తగ్గించుకునేందుకు రిజర్వు పోర్టు పోలియోను వైవిధ్య ఫలితంగా మార్చుకునేందుకు భారత్ కొన్ని సంవత్సరాలుగా బంగారాన్ని మరింత వేగంగా కొనుగోలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
కేవలం పెద్ద దేశాలే కాదు ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా, కజకిస్తాన్, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాలు కూడా బంగారం నిల్వలను నిరంతరం పెంచుకుంటూనే ఉంటున్నాయి. సాంకేతికత ఎంత మారినప్పటికీ ఆర్థిక సంక్షోభాలు ఎదురైనప్పుడు ఎప్పటికీ ప్రపంచంలో ఏకైక ఆస్తి బంగారమేనని ఈ నిలువలు నిరూపిస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.