Reliance Share Price: గతంలో స్టాక్ మార్కెట్లో పలు హెవీ వెయిట్ స్టాక్స్, బ్లూచిప్ స్టాక్స్ బాగా రాణస్తుండేవి. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగేవి.
ఇన్వెస్టర్లకు స్థిరంగా రిటర్న్స్ ఇస్తూ వెళ్లేవి. అయితే ఇటీవల మాత్రం పరిస్థితులు మారిపోయాయి. చిన్నా పెద్దా, బలమైన బలహీనమైన అనే తేడా లేకుండా పతనం అవుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం వల్ల అనుకుంటే పొరపాటే. దానికి ముందు కూడా పలు బ్లూచిప్ స్టాక్స్ భారీగా పడిపోయాయి. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి పతనం అవుతూ ఇన్వెస్టర్లు నమ్మకం పెట్టుకుంటే వారిని ముంచేస్తున్నాయి. ఇందులో పెద్ద పెద్ద కంపెనీలు భారత్‌లో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీగా ఉన్న రిలయన్స్ నుంచి మొదలుకొని హెచ్డీఎఫ్సీ, మారుతీ సుజుకీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ షేర్లు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నప్పుడు పెద్ద పేరున్న కంపెనీలే కదా ఇంకా పెరుగుతాయిలే అనుకొని కొనుగోలు చేసిన వారికి భారీ నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఇందులో bluఏమేం కంపెనీలు ఉన్నాయి.. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి ఎంత పడిపోయాయో చూద్దాం. దీనికి సంబంధించి సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ సునిల్ గుర్జార్ ఒక లిస్ట్ పెట్టారు. వీటిల్లో అత్యధికంగా ప్రభావితమైనవి మాత్రం ఐటీ స్టాక్స్ . ఇందులోనూ భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ ముందుంది. టీసీఎస్ స్టాక్ ప్రస్తుతం రూ. 2100 దిగువన ఉండగా ఇది జీవన కాల గరిష్ఠ స్థాయిల నుంచి ఏకంగా 55 శాతం పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. దీని ఆల్ టైమ్ హై వాల్యూ రూ. 4500 పైనే ఉంది. ఇందులో రెండో స్థానంలో ప్రముఖ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఉంది. ఈ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి 48.70 శాతం తగ్గింది. ఆల్ టైమ్ హై వాల్యూ రూ. 2000 పైన ఉండగా ఇప్పుడు రూ. 1050 స్థాయిలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ ఆల్ టైమ్ హై నుంచి 24 శాతం తగ్గి ఇన్వెస్టర్లకు నష్టాల్ని మిగిలిస్తోంది. హిందుస్థాన్ యూనిలివర్ కూడా గరిష్ఠాల నుంచి 27 శాతం తగ్గింది. మారుతీ సుజుకీ 22.63 శాతం తగ్గగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా గరిష్ఠ స్థాయికి 18.72 శాతం దూరంలో ఉంది. ఎస్బీఐ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి 17 శాతం దిగువన ఉంది. గరిష్ఠాల నుంచి బజాజ్ ఫైనాన్స్ 12.79 శాతం, భారతీ ఎయిర్టెల్ 12.56 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 10.78 శాతం తగ్గింది. ఎల్అండ్టీ, సన్ ఫార్మా 4.46 శాతం తగ్గాయి.బ్లూచిప్స్ మాట ఒకప్పుడు..!అయితే ఇవన్నీ బ్లూ చిప్ స్టాక్స్, కాబట్టి మళ్లీ పుంజుకుంటాయన్న వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గత కొన్నేళ్లలో చూస్తే ఈ స్టాక్స్ దాదాపుగా పెద్దగా పాజిటివ్ రిటర్న్స్ ఏం ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ పైన చెప్పుకున్న కంపెనీలు ఆర్థికంగా అత్యంత స్థిరపడ్డ, బలమైన బ్రాండ్, మార్కెట్లో మంచి పొజిషన్లో ఉన్న కంపెనీల షేర్లు. లాభాల్ని ఆర్జించడంలో, ఇంకా మార్కెట్ ఒడుదొడుకుల్ని తట్టుకోవడంలో నమ్మదగినవిగా ఉండేవి. కానీ ఇటీవలి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.Disclaimer: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.