
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు స్వతంత్ర న్యాయ సమీక్షలో ఊరట లభించింది. మాజీ పార్ట్‌టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా సందర్భంగా చేసిన పాలన, నైతికతకు సంబంధించిన...
Jun 27 2026 8:07 AM | Updated on Jun 27 2026 8:10 AM
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు స్వతంత్ర న్యాయ సమీక్షలో ఊరట లభించింది. మాజీ పార్ట్‌టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా సందర్భంగా చేసిన పాలన, నైతికతకు సంబంధించిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని రెండు బాహ్య న్యాయ సంస్థలు తేల్చాయి.
అమెరికాకు చెందిన ‘విల్సన్ సోన్సిని గుడ్రిచ్ & రొసాటి’ (సంక్షిప్తంగా విల్సన్ సోన్సిని)తో పాటు భారతీయ న్యాయ సంస్థ ‘వాడియా ఘండి & కో’ నిర్వహించిన మూడు నెలల సమీక్షలో బోర్డు సమావేశాల మినిట్స్, కమిటీ రికార్డులు, అధికారిక కమ్యూనికేషన్లు, సంబంధిత పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించినప్పటికీ చక్రవర్తి చేసిన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సమకాలీన ఆధారాలు కనిపించలేదని బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.
బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. సమీక్షలో భాగంగా స్వతంత్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ఎండీ-సీఈవో శశిధర్ జగదీశన్‌తో పాటు సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. వేలాది పత్రాలు, బోర్డు ఎజెండాలు, సమావేశ మినిట్స్‌ను పరిశీలించారు. అతాను చక్రవర్తిని కూడా పలుమార్లు విచారణలో పాల్గొనాలని కోరినా, చివరకు ఆయన ఇంటర్వ్యూకు హాజరుకాలేదని బ్యాంకు వెల్లడించింది.
మార్చిలో తన రాజీనామా లేఖలో బ్యాంకులో గత రెండేళ్లుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని చక్రవర్తి పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుబాయ్ శాఖకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక రికార్డుల్లో ఆయన అభ్యంతరాలు నమోదు చేసినట్లు లేదా బోర్డు నిర్ణయాలపై అసమ్మతి వ్యక్తం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని న్యాయ సమీక్ష స్పష్టం చేసింది.
బోర్డు స్థాయిలో చర్చించిన అన్ని అంశాలు నిర్దేశిత పాలనా విధానాలకు అనుగుణంగానే నిర్వహించబడ్డాయని, ఎలాంటి కీలక లోపాలు గుర్తించలేదని బ్యాంకు పేర్కొంది. ఈ నివేదికను ఆడిట్ కమిటీ, అనంతరం బోర్డు పరిశీలించనుంది.
జగదీశన్ పదవీకాలం పొడిగింపునకు మార్గం సుగమం
ఈ న్యాయ సమీక్షతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పదవీకాల పొడిగింపు ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్‌లో ముగియనుండగా, మరోసారి నియామకానికి తనను అందుబాటులో ఉంచినట్లు గతంలో వెల్లడించారు. బోర్డు ఆమోదం అనంతరం సంబంధిత ప్రతిపాదనను ఆర్బీఐకి పంపనున్నారు.
చక్రవర్తి ఆకస్మిక రాజీనామా తర్వాత పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొని, బ్యాంకు మార్కెట్ విలువలో సుమారు రూ.1 లక్ష కోట్లకుపైగా క్షీణత నమోదైంది. అనంతరం ఆర్బీఐ బ్యాంకు పాలనపై నమ్మకం వ్యక్తం చేయగా, ఇప్పుడు స్వతంత్ర న్యాయ సమీక్ష కూడా ఎలాంటి పాలనా లోపాలు లేవని తేల్చడంతో ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)
గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)
మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)
ప్రజలకు చిప్ప..? బినామీలకు కాసుల కుప్ప.. ప్రైవేట్ రాజ్యం
హస్తికలు వెలికితీయండి... సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై NHRC ఆగ్రహం
కర్త, కర్మ, క్రియ CP రాజశేఖర్ బాబే...! హైకోర్టు న్యాయమూర్తికి నా విన్నపం ఇదే
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
మళ్లీ యుద్ధం.. ఇరాన్ పై భారీ స్థాయిలో దాడులు చేసిన అమెరికా