
Today Astrology June 27 Telugu: ఈరోజు రాశి ఫలాలు.. శ్రీ పరాభవనమ సంవత్సరం, జేష్ట మాసం, కృష్ణ పక్షం. 2026 జూన్ 27, శనివారం. పండితుల ప్రకారం ఈరోజు ఏ రాశి వారు కొత్త పనులు మొదలుపెట్టకూడదు?
ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? అనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం.
మేషరాశి వారికి ఈరోజు అంతా ఒకేలా ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి చేయండి, కొత్త పనులకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఒత్తిడి పెరగవచ్చు, డబ్బు విషయంలో కూడా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. మేష రాశి వారు ఇతరుల గొడవల్లోకి వెళ్లకుండా ఉండండి, ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండటం ముఖ్యం.
మిథున రాశి వారికి ఈరోజు చాలా సరదాగా గడుస్తుంది. అంతా హాయిగా సాగిపోతుంది, కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. మిథున రాశి వారికి ఏదో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. చదువుకునే పిల్లలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి ఏదైనా ట్రిప్ వెళ్లే ఛాన్స్ ఉంది.
కర్కాటక రాశి వారికి ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. డబ్బు విషయంలో నష్టాలు వచ్చే వీలుంది, ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం తగ్గించండి. కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు, కాబట్టి జాగ్రత్త. ఎవరితోనూ వాదనలకు దిగకండి, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
కన్యా రాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కలిసి వస్తాయి, ఆర్థికంగా కూడా పుంజుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు, ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
కుంభ రాశి వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు, డబ్బు కూడా కలిసి వస్తుంది. సమాజంలో మీ గౌరవం, హోదా పెరుగుతాయి. ఈరోజు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)