
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ సరుకు రవాణా నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి అమెరికా అత్యంత వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఇరాన్‌కు చెంది
న పలు సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు లక్షిత వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ‘మూర్ఖత్వంతో ఉల్లంఘించిందని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎం/వీ ఎవర్ లవ్లీ’ అనే కంటైనర్ నౌకపై జూన్ 25న ఇరాన్ ‘వన్-వే అటాక్’ డ్రోన్‌తో దాడికి తెగబడింది. తైవాన్‌కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ సంస్థ నడుపుతున్న ఈ నౌక.. హర్మూజ్ జలసంధి గుండా ఒమన్ తీరం మీదుగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దాడిలో నౌక పైభాగం, బ్రిడ్జి ఏరియా పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ.. సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదు. చమురు లీకేజీ వంటి పర్యావరణ నష్టం జరగకపోవడంతో నౌక తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ దాడికి ఇరానే కారణమని అమెరికా అధికారికంగా ధ్రువీకరించింది.ఈ ఘటనపై ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఇరాన్ మొత్తం నాలుగు డ్రోన్లతో ఈ దాడికి వ్యూహం రచించిందని, వాటిలో మూడింటిని అమెరికా దళాలు గాల్లోనే అడ్డుకోగా, నాలుగోది నౌకను ఢీకొట్టిందని వెల్లడించారు. నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణం సాగిస్తోందని చెబుతూ.. జలసంధిలో సురక్షిత ప్రయాణాల కోసం గత వారం స్విట్జర్లాండ్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఇరాన్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయని విలేకరులు