
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు.
అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Ketan Agarwal Wig:పుణెలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించిన పోలీసులు, తర్వాత దర్యాప్తులో ఇది ముందే పథకం వేసి చేసిన హత్య అని అనుమానిస్తున్నారు.
25 ఏళ్ల కేతన్ అగర్వాల్ తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు సియా గోయల్‌తో నిశ్చితార్థం జరిగింది. జూన్ 18న మహారాష్ట్రలోని లోహగడ్ కోట వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లిన సమయంలో కేతన్ కొండపై నుంచి కిందపడిపోయి మరణించాడు. మొదట కేతన్ జారి పడిపోయాడని చెప్పినా, తర్వాత పోలీసుల దర్యాప్తులో అనేక అనుమానాస్పద విషయాలు బయటపడ్డాయి.
ఈ కేసులో సియా గోయల్‌తో పాటు ఆమె ప్రియుడు చేతన్ చౌదరిపై పోలీసులు హత్య, కుట్ర కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి కేతన్‌ను హత్య చేయాలని ముందుగానే ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇదే సమయంలో కేతన్ విగ్ ధరించేవాడనే విషయం హత్యకు కారణమనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ పూర్తిగా ఖండించారు. తన కుమారుడికి చిన్నపాటి జుట్టు రాలే సమస్య ఉందని, అది వైద్య కారణాల వల్లే వచ్చిందని చెప్పారు. ఈ విషయం నిశ్చితార్థానికి ముందే సియా కుటుంబానికి స్పష్టంగా చెప్పామని వెల్లడించారు.
"ఆ విషయంపై సియాకు అభ్యంతరం ఉంటే పెళ్లిని రద్దు చేసుకునే అవకాశం ఉండేది. కానీ అలాంటి చిన్న కారణంతో హత్య చేయాల్సిన అవసరం ఏముంది?" అని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల ప్రకారం, సియా గత కొన్ని వారాలుగా పలుమార్లు లోహగడ్ కోటకు వెళ్లాలని కేతన్పై ఒత్తిడి చేసింది. ఒకసారి అతన్ని తోసేయడానికి కూడా ప్రయత్నించిందని దర్యాప్తులో తెలిసింది. అలాగే సియా, చేతన్ మధ్య వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ జరిగినట్లు కాల్ రికార్డులు వెల్లడించాయి.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Read more:Ketan Agarwal Death Case: పూణె బిజినెస్ మెన్ ఘటన.. కాబోయే భర్తను చంపిన కిల్లర్ లేడికి చెప్పుల దండ.. వీడియో వైరల్.. Read more: Ketan Agarwal Murder Case: పూణె కేతన్ అగర్వాల్ హత్య కేసు.. వెలుగులోకి మరో ట్విస్ట్.. ఇంత చిన్నదానికి చంపిందా..?.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.