
బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది.
Jun 26 2026 9:36 PM | Updated on Jun 26 2026 9:53 PM
బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఐర్లాండ్ తొలి టీ20లో 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (50) మినహా మిగిలినవారంతా దారుణంగా విఫలమయ్యారు.
లోయర్ ఆర్డర్లో శివమ్ దూబే (25) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హొల్లార్డ్, మాథ్యూ హంపేరీస్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, భారత మూలాలున్న జై మూంద్రా రెండు వికెట్లు తీశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్‌పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)
మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)
శోభిత మాన్సూన్ లుక్.. గ్లామర్ మూమూలుగా లేదు! (ఫొటోలు)
థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్లో సినిమా జంట (ఫొటోలు)
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మేడం..
శిష్యుడి కోసం బుడ్డోడికి గంభీర్ వెన్నుపోటు
సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై సునీత రియాక్షన్