
సింగపూర్ విద్యావిధానం అత్యంత క్రమశిక్షణతో, విజ్ఞానదాయకంగా ఉందని, అక్కడి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లివచ్చిన ఉత్తమ...
సింగపూర్ విద్యావిధానం అత్యంత క్రమశిక్షణతో, విజ్ఞానదాయకంగా ఉందని, అక్కడి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లివచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ యాత్రకు వెళ్లిన 37 మంది ఉపాధ్యాయులు శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో తాము గమనించిన అంశాలను, వాటిని రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను వారు మంత్రికి వివరించారు.సింగపూర్‌లో ఉపాధ్యాయులు ప్రతి వారం సమావేశమై సబ్జెక్టుల వారీగా చర్చించుకోవడం, వారి మధ్య సమన్వయం అద్భుతంగా ఉందని టీచర్లు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్, రాష్ట్రంలో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకే చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. తాను చదివిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫైనల్ పరీక్షలకు ఇన్విజిలేటర్లు ఉండరని, 'ఆనర్ కోడ్' అనే స్వీయ క్రమశిక్షణ పాటిస్తారని, అందుకే ఎవరూ కాపీయింగ్ వంటివి చేయరని ఉదహరించారు. 'తల్లికి చెప్పలేని పని చేయొద్దు' అన్న చాగంటి గారి మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని లోకేశ్ అన్నారు.వివిధ జిల్లాల ఉపాధ్యాయుల సూచనలుభీమిలికి చెందిన హెచ్ఎం తిరుమల శ్రీదేవి మాట్లాడుతూ.. సింగపూర్‌లో 'వెల్ నెస్ అంబాసిడర్స్', 'మెంటల్ హెల్త్ కౌన్సిలర్'ల నియామకం ద్వారా ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచుతున్నారని తెలిపారు. సీనియర్ టీచర్లు జూనియర్లకు మార్గనిర్దేశం చేయడం, పాఠశాల స్థాయిలో 'వెల్ బీయింగ్ కమ్యూనిటీస్', నెలవారీ కాంప్లెక్స్ మీటింగ్‌లు, స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్‌షాపులు, టీచర్ల విజయాలను వేడుకగా జరపడం