
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై తెరకెక్కుతోన్న చిత్రం ధర్మన్ (Dharman) కోలీవుడ్...
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై తెరకెక్కుతోన్న చిత్రం ధర్మన్ (Dharman)
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై తెరకెక్కుతోన్న చిత్రం ధర్మన్ (Dharman). ఓ మై కడవులే చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తోన్నారు. వీరితో పాటు మీనాక్షీ చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. సౌత్ ఇండస్ట్రీలోనే ఇద్దరు బిగ్గెస్ట్ లెజెండ్స్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా కథాంశానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ధర్మన్ సినిమా కథ ఒకప్పుడు టాలీవుడ్లో నటభూషణ శోభన్ బాబు హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్ సూపర్ హిట్ చిత్రం సర్పయాగం కి రీమేక్‌లా ఉండబోతోందని గట్టిగా ప్రచారం సాగుతోంది. కూతురు కోసం హత్యలు చేసే ఒక డాక్టర్ కథ.. సర్పయాగం. తండ్రిగా శోభన్ బాబు నటించగా.. కూతురిగా రోజా కనిపించింది. 1991లో ఎంతో సంచలనం సృష్టించిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, సమాజంలోని అన్యాయాలపై ఒక తండ్రి చేసే పవర్ఫుల్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. కొంతమంది డాక్టర్ కూతురిని అత్యాచారం చేసి చంపేస్తారు. వారిపై పగ తీర్చుకోవడానికి ఆ డాక్టర్ ఏం చేశాడు.. ? హత్యల కోసం వైద్య విధానాన్ని ఎలా వాడుకున్నాడు.. ? అనేది సర్పయాగం కథ. ఇప్పుడు ఈ స్టోరీ లైన్ తోనే ధర్మన్ తెరకెక్కనుందని టాక్ నడుస్తోంది. రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్‌కు, ఆయన మాస్ ఇమేజ్‌కు ఈ తరహా ఇంటెన్స్ ఎమోషనల్ సబ్జెక్ట్ వంద శాతం పర్ఫెక్ట్గా సరిపోతుందని, అందుకే అశ్వత్ మారిముత్తు ఈ పాత కథను నేటి తరం ట్రెండ్‌కు తగ్గట్లుగా స్క్రిప్ట్ మార్పులు చేసి లీడ్ చేస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ ఇదే నిజమైతే.. థియేటర్లలో రజనీకాంత్ నటనకు, ఎమోషన్స్‌కి ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.ఈ సినిమాలో రజనీ కూతురుగా మీనాక్షీ చౌదరి కనిపించబోతోందంట. తండ్రిగా నటించడం రజనీకి కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఇలాంటి తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ తోనే రజనీ దర్బార్ సినిమా చేశారు. ఇందులో నివేథా థామస్ కూతురిగా కనిపించింది. కానీ, ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సర్పయాగం స్టోరీ లైన్ తోనే కనుక ధర్మన్ వస్తే.. కచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయని నెటిజన్స్ అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.