
కన్నడ చిత్ర పరిశ్రమలో కొందరు స్టార్ హీరోలు లేడీ గెటప్స్ వేసి కూడా పాపులర్ అయ్యారు. ఏ హీరో, ఏ సినిమాలో లేడీగా కనిపించి మెప్పించారో ఓ లుక్కేద్దాం. బి.ఎస్. రంగా దర్శకత్వం వహించిన 'చంద్రహాస' సినిమాలో డా.
రాజ్‌కుమార్ లేడీ గెటప్ వేశారు. ఇందులో ఆయన డ్యాన్స్ టీచర్‌గా నటించి అందరి మనసులు దోచుకున్నారు.
పి.ఎన్. రామచంద్రరావు డైరెక్షన్లో వచ్చిన 'బొంబాట్ హెండ్తి' సినిమాలో హీరో శ్రీధర్ మహిళా వేషంలో కనిపించారు.
హీరో శరణ్ 'జై లలిత' అనే కామెడీ సినిమాలో లేడీ గెటప్‌లో నటించి కడుపుబ్బా నవ్వించారు.
నవరస నాయక జగ్గేష్ 'మేకప్' అనే సినిమాలో మహిళా పాత్రలో మేకప్ వేసుకుని అదరగొట్టారు.
దక్షిణాది పాపులర్ నటుడు ప్రకాశ్ రై 'అనుకూలక్కొబ్బ గండ' సినిమాలో లేడీ గెటప్‌లో చాలా క్యూట్‌గా కనిపించారు.
'కల్పన' అనే హారర్ సినిమాలో సాయికుమార్ ట్రాన్స్‌జెండర్ (మంగళముఖి) పాత్రలో కనిపించారు. ఈ క్యారెక్టర్ పెద్ద హిట్ అయ్యింది. సాయికుమార్ కన్నడలో స్టార్ రాణిస్తోన్న విషయం తెలిసిందే.
ఇటీవల `పెద్ది`లో మెరిసిన హీరో శివరాజ్‌కుమార్ '45', 'మిడిత శ్రుతి' సినిమాల్లో మహిళగా కనిపించి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.
'నాను అవనల్ల అవళు' సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో అద్భుతంగా నటించినందుకు సంచారి విజయ్ జాతీయ అవార్డు అందుకున్నారు.
సాహససింహ విష్ణువర్ధన్ 'హబ్బ' సినిమాలో చీర కట్టుకుని అమ్మాయిలా నటించారు. ఈ సినిమాలో అంబరీష్, శశికుమార్ కూడా గెటప్స్ మార్చడం విశేషం.
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Faria Abdullah: ఎరుపు చీరలో మెరుపులు మెరిపిస్తున్న ఫరియా అబ్దుల్లా
OTT Movies: ఓటీటీలో తప్పక చూడాల్సిన 7 డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్