
వ్యవసాయ రంగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. జబల్పూర్కు చెందిన ప్రసిద్ధ బఠాణీ (మటర్), సింఘాడా (వాటర్ చెస్ట్నట్..
నీటిలో పెరిగే ఒకరకమైన కాయలు) ఉత్పత్తులకు ప్రతిష్ఠాత్మక భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ లభించింది. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ ఈ గుర్తింపును మంజూరు చేసినట్లు ప్రభుత్వ అధికారులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దేశంలో బఠాణీ, సింఘాడా పంటలకు ఒకేసారి జీఐ ట్యాగ్ లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విజయంతో జబల్పూర్ దేశ వ్యవసాయ పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.జబల్పూర్కు చెందిన మైకల్సుత ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండు వ్యవసాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసింది. నర్మదా నదీ లోయలోని సారవంతమైన నేలలు, ప్రత్యేకమైన సూక్ష్మ వాతావరణ పరిస్థితులే ఈ పంటల అద్భుతమైన నాణ్యత, రుచి, అధిక దిగుబడికి ప్రధాన కారణమని వ్యవసాయ నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. నర్మదా నదిలోని పోషకాలు అధికంగా ఉండే నీరు వీటికి ప్రత్యేక లక్షణాలను అందిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రత్యేకతల కారణంగానే జబల్పూర్ బఠాణీలు, సింఘాడాలకు స్థానిక మార్కెట్లతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.ఇప్పటికే జబల్పురి బఠాణీ కేంద్ర ప్రభుత్వ 'ఒక జిల్లా-ఒక ఉత్పత్తి' (ఓడీఓపీ) పథకంలో చోటు దక్కించుకుంది. ఇప్పుడు జీఐ ట్యాగ్ కూడా లభించడంతో దీని బ్రాండ్ విలువ మరింత పెరగనుంది. ధ్రువీకరించిన ఉత్పత్తులు కావడంతో దేశ, విదేశీ వ్యాపారులు రైతులకు మంచి ధరలు ఇచ్చేందుకు ముందుకు వస్తారని, తద్వారా రైతుల ఆదాయం గణనీయంగా