
ఫిలిప్పీన్స్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. మిండనావ్ ద్వీపంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ ఫిలిప్సీన్స్ ద్వీపం మిండనావ్లో తాజాగా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంప కేంద్రం 29 కిలోమీటర్ల లోతున ఉందని యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా సంభవించిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు సునామీ హెచ్చరికలను కూడా జారీ చేయలేదు. ఇటీవల ఫిలిప్పీన్స్ దక్షిణ తీరానికి సమీపంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మిండనావ్ ప్రాంతంలో పలు భవనాలు కూలిపోయాయి. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంపాల ముప్పు అధికంగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ ఉండటంతో అక్కడ తరచూ భూమి కంపిస్తుంటుంది. ఒక్కోసారి భారీ భూకంపాలు కూడా దేశాన్ని కుదిపేస్తుంటాయి.
ఇదిలా ఉంటే వెనెజువెలాలో ఇటీవల భూకంపం బారిన పడి మరణించిన వారి సంఖ్య 589కు పెరిగింది. మరో 2,980 గాయపడ్డారని వెనెజువెలా ఆపద్ధర్మ రాష్ట్రపతి డెల్చీ రాడ్రీగెజ్ తెలిపారు. ఈ కష్ట సమయంలో మానవతా సాయాన్ని పంపిస్తున్న వివిధ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని అన్నారు.
అపరేషన్ అమిస్తాడ్.. వెనెజువెలాకు భారత్ ఆపన్న హస్తం