
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Deewana Ticket Offer: ‘దీవానా’ గత వారం విడుదలైన ఈ సినిమా మంచి మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీ విష్ణు ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. అంతేకాదు రేపు (శనివారం) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి ఊర్లో ‘దీవానా’ ఫస్ట్ 25 టికెట్స్ కొన్నవారికి మరొక టికెట్ ఫ్రీ అని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా నచ్చితే మీతో పాటు మరొకరిని టాకీస్‌కు తీసుకెళ్లండి. లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు ‘దీవానా’ మీకు నచ్చకపోత మీకు వేస్ట్ అయిన టైమ్‌ను వడ్డీతో ఇచ్చేస్తానంటూ శ్రీ విష్ణు సభా ముఖంగా ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది.
యువ నటుడు హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమాను అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోయిన్ స్మేహ మణిమేగలై వెండితెరకు పరిచయం అయింది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ సినిమాతోనే మెగాఫోన్ పట్టుకున్నాడు. ఇటీవల గ్రాండ్ థియేట్రికల్‌గా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థాంక్యూ మీట్‌ను నిర్వహించారు. దీనికి శ్రీ విష్ణు ముఖ్యఅతిథిగా హాజరై ఈ సినిమా బాగాలేకపోతే.. తన సినిమా విడుదలనపుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానని ఛాలెంజ్ విసిరాడు.
డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ - సినిమానే జీవితం అనుకున్నాను. దీవాన సినిమా అవకాశం కల్పించడం ద్వారా నాకు కొత్త లైఫ్‌ను ఇచ్చారు ప్రొడ్యూసర్స్ వాసు, శ్రీదేవి. దీవాన మూవీని బ్యాడ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. ఆ టైమ్ లో నాకు ఏమీ కాని మీడియా మిత్రులు అండగా నిలబడ్డారు. మా సినిమా కథను పేపర్ మీద నేను రాస్తే, స్క్రీన్ మీద రాసినట్లు తెరకెక్కించింది మా డీవోపీ వంశీ. సలీం అనార్కలి లవ్ కంటే నాకు నా దీవాన ఎక్కువ. ఈ సినిమాను చంపాలని ఎంత చూసినా లేస్తూనే ఉంటుందన్నార. థియేటర్స్ కు వెళ్లి చూడండి ఐదు రోజుల్లో ఐదుసార్లు చూశామని చెబుతున్న వాళ్లున్నారు. ఈ సినిమాను మీ పిల్లల్ని పక్కన పెట్టుకుని బిగ్ స్క్రీన్ లో చూపించడని చెప్పుకొచ్చారు. మీరంతా బిగ్ స్క్రీన్ లో మూవీ చూస్తేనే నాకు ఆనందం అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ - మా సినిమా థ్యాంక్యూ మీట్ కు అతిథిగా వచ్చిన శ్రీవిష్ణు గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈ చిత్రంలో నరేష్ క్యారెక్టర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. జర్నలిస్ట్ ప్రేమ సింగీతం, మా ఇంటి బంగారం, దీవాన మూవీ పోస్టర్స్ నాకు పంపుతూ ఈ మూడు చిత్రాలు లేడీ ప్రొడ్యూసర్స్ చేసినవే అని చెప్పుకొచ్చారు. ఇలాంటి మంచి చిత్రాలు చూస్తే మనసు నిండిపోతుంది అని ప్రశంసించారు.
ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ - మా దీవాన మూవీకి కథే హీరో. ఈ బ్యూటిఫుల్ కథకు మా టెక్నికల్ టీమ్ అందరూ స్క్రీన్ మీద లైఫ్ తీసుకొచ్చారన్నారు. సినిమా అనేది అందుబాటు ధరల్లో ఉండాలనేది మా కోరిక. అందుకే సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు, అన్ని పీవీఆర్ స్క్రీన్స్ లో 105 రూపాయలకే టికెట్ దర పెట్టామన్నారు.
హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ - దీవాన సినిమా ఒక మిరాకిల్ బేబి లాంటిది. మా సినిమాకు స్టార్ పవర్ లేదు. అంతా కొత్త వాళ్లమే చేశాము. కొత్త వాళ్లందరు కలిసి చేసిన మా సినిమా ఫస్ట్ వీక్ తర్వాత కూడా థియేటర్స్ లో 70 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందంటే అదే మాకు నిజమైన సక్సెస్ గా భావిస్తున్నామన్నారు. నేను హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది సమంత. ఆమె సినిమాతో పాటు మా దీవాన మూవీ రిలీజ్ అవుతుందంటే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. అలాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు మా సినిమా కూడా సక్సెస్ పుల్ గా రన్ అవుతుందంటే అదీ మా విజయమే అనుకుంటున్నాము. ప్రేక్షకులు మా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ను గుర్తుపెట్టుకుంటున్నారు. దీవాన ఒక అరుదైన మూవీ. థియేటర్స్ లో చూడండి బాగా ఎంజాయ్ చేస్తారన్నారు.
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ - ఈ వేదిక మీద అందరు జెన్యూన్‌గా రెస్పాన్స్ అయ్యారు. నిజాయితీతో చేసిన ప్రేమ కథ కాబట్టే దీవాన విజయం సాధించింది. ఈ సినిమా టీమ్ అంతా గొప్ప స్థాయికి వెళ్తారు. ఇలాంటి మంచి చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. మీరు దీవాన సినిమాను థియేటర్ కు వెళ్లి చూడండి. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు, నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.