
భారత్ కు మళ్లీ అమెరికా సుంకాల మోత (US Tariffs) తప్పేలా లేదు. ఓవైపు వాణిజ్య ఒప్పందంపై సంతకాలకు ముందు ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్న క్రమంలో.. మళ్లీ అమెరికా సుంకాల హెచ్చరికలు చేసింది.
అదీ గతంలో ఉన్న స్థాయికి సుంకాల్ని విధిస్తామంటూ హెచ్చరించింది. దీంతో అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.భారత్ కు బంగ్లా భారీ షాక్..! చైనా చేతికి ఆ కీలక పోర్టు..!వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు సెక్షన్ 301 సుంకాల విషయంలో మరింత స్పష్టత, ఇతర దేశాల కంటే పోటీతత్వ ప్రయోజనం అవసరమని భారతీయ చర్చల ప్రతినిధులు గట్టిగా కోరుతున్నారు. ఈ తరుణంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక ప్రకటన చేశారు. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 నిబంధనలను అమలు చేయడం ద్వారా సుంకాలు తిరిగి గతంలో విధించిన స్థాయికి చేరుకుంటాయని తెలిపారు. ఆంత్రోపిక్ తరహాలోనే ఓపెన్ ఏఐకీ ట్రంప్ షాక్..! ఏం జరుగుతోంది ?తాము సుంకాల విధానాన్ని పునరుద్ధరించామని, ప్రస్తుతం తమ వద్ద సెక్షన్ 122 సుంకాలు ఉన్నాయని తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా విధించే 10 శాతం సుంకం అన్నారు. ప్రస్తుతం USTR అంబాసిడర్ జేమ్సన్ గ్రీర్ సెక్షన్ 301 సుంకాలకు సంబంధించి అధ్యయనాలు చేస్తున్నారు. ఆ అధ్యయనాలు విజయవంతమైతే సుంకం రేట్లు తిరిగి సరిగ్గా వాటి పాత స్థాయికి చేరుకుంటాయని బెస్సెంట్ ఓ ఇంటర్వూలో వెల్లడించారు. మరోవైపు ట్రంప్ కు చెప్పుకుంటున్న అత్యవసర అధికారాలు చట్ట విరుద్దమని తేలిన నేపథ్యంలో అంతకంటే ముందున్న 18 శాతం సుంకాల్ని భారత్ పై విధించే అవకాశాలున్నాయి. అంతకు ముందు 25 శాతం సుంకాలు, మరో 25 శాతం జరిమానా సుంకాలు కలిపి 50 శాతం సుంకాల్ని ట్రంప్ విధించారు.