
‘రక్షిత’ అనే బైక్ అంబులెన్స్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించింది. సన్నని దారులు, వరద ప్రభావిత ప్రాంతాలు, విపత్తు సంభవించిన ప్రదేశాల్లో వేగంగా వైద్యసహాయం అంది
ంచేందుకు వీటిని సిద్ధం చేశారు. వీటిలో ఆక్సిజన్ స్థాయిలు, ECG రీడింగ్ తదితర కీలక ఆరోగ్య పారామీటర్లను తెలుసుకునే అధునాతన హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, చిన్న ఆక్సిజన్ సిలిండర్, IV ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. బైక్‌లో రోగి సీటును చైర్‌గా, స్ట్రెచర్‌గా ఉపయోగించవచ్చు. ధర సుమారు రూ. 3.5 లక్షలు ఉంటుంది. సంప్రదాయ నాలుగు చక్రాల అంబులెన్స్‌తో పోలిస్తే దాదాపు సగం ధరకే ఈ బైక్ అంబులెన్స్ లభిస్తుంది. ఈ వార్త చదివారా: ‘లీడర్ ఆఫ్ పర్యాటన్’గా రాహుల్ పేరు మార్చుకోవాలి: భాజపా