
కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే, ఒక అభ్యర్థికి సంబంధించిన అన్ని రకాల విద్య, క్రీడా సర్టిఫికెట్లు డిజిటల్‌గా వెరిఫై అయ్యే పారదర్శకమైన, పటిష్ఠమైన వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని ఐటీ, విద్యాశాఖ...
కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే, ఒక అభ్యర్థికి సంబంధించిన అన్ని రకాల విద్య, క్రీడా సర్టిఫికెట్లు డిజిటల్‌గా వెరిఫై అయ్యే పారదర్శకమైన, పటిష్ఠమైన వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ సులభతరం అవ్వడమే కాకుండా, రాబోయే వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థి ఆధార్ నంబర్ కొట్టగానే, ఆ సర్టిఫికెట్‌ను ఏ సంస్థ, ఎప్పుడు, ఎవరు జారీ చేశారనే వివరాలు రియల్ టైమ్‌లో తెలిసేలా 'డిజి వెరిఫై' వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ఇది అధికారుల పనిని 99 శాతం సులభతరం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల పురోగతిని ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకేచోట క్రోడీకరించే 'డేటా లేక్' పనులను జులై నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ల సంఖ్యను డేటా లేక్ ద్వారా విశ్లేషించి, వారిని తిరిగి బడికి రప్పించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్‌తో అనుసంధానించాలన్నారు.ప్రజా సేవలు మరింత చేరువ కావాలిప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై నెలరోజుల పాటు విస్తృతంగా అవగాహన