
Khushboo Daughter Wedding : అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం (జూన్ 25) అవంతిక, శ్రవణ్‌ల వివాహం గోవాలోని ఓ రిసార్ట్‌లో జరిగింది.
Actress Khushboo Daughter Avantika wedding
Khushboo Daughter Wedding : అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం (జూన్ 25) అవంతిక, శ్రవణ్‌ల వివాహం గోవాలోని ఓ రిసార్ట్‌లో జరిగింది. వీరి వివాహానికి చిరంజీవి, నాగార్జున, త్రిషలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. తాజాగా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఖుష్బూ ఎమోషనల్ అయ్యారు.
‘ప్రస్తుతం మా ఆనందాన్ని మాట్లలో చెప్పలేం. కుటుంబమే మా జీవితంలో అత్యంత విలువైంది. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయని మేము ఎల్లప్పుడూ నమ్ముతాము. మా ప్రియమైన కుమార్తె అవంతిక సుందర్‌కు, శ్రవణ్ శ్రీనివాసన్‌తో 2026 జూన్ 25న వివాహం జరిగిందనే అద్భుతమైన వార్తను పంచుకోవడానికి సంతోషిస్తున్నాము.
Aditi Myakal : నాభి అందాలతో రెచ్చిపోతున్న తెలుగు నటి అదితి..
కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రేమ మధ్య, మా హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక క్షణానికి మేము సాక్షులుగా నిలిచాము. మా కళ్ళు ఇంకా చెమ్మగిల్లుతున్నాయి. మా హృదయాలు ఆనందం, కృతజ్ఞతతో పొంగిపోతున్నాయి. వధూవరుల కోరిక మేరకు అత్యంత సాదాసీదాగా, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వేడుక నిర్వహించాం.
కొన్నిసార్లు మనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో నిశ్శబ్దంగా పంచుకునే క్షణాలే అత్యంత అందమైనవి. అవంతిక, శ్రవణ్ లు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో వారి జీవితం సంతోషం, లెక్కలేనన్ని మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాం. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, శుభాకాంక్షలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం . ‘అని ఖుష్బూ సుందర్ దంపతులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Ramya moksha : పింక్ డ్రెస్‌లో పచ్చళ్ల పాప రమ్య
ఇదిలా ఉంటే.. అవంతిక ప్రస్తుతం ఓ మలయాళ సినిమాలో నటిస్తుంది.