
ఏపీలో రెండు రోజులు వర్షాలు. ఐదు జిల్లాలకు హై అలర్ట్. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP Rains)లో రాబోయే రెండు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శనివారం నాడు ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో మరో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.5 తీవ్రత ఈ జిల్లాలకు హై అలర్ట్: ఇక ఆదివారం నాటికి ఈ వర్షాలు కోస్తా జిల్లాలంతటా విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల ప్రజలను, అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. వర్షంతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతో అవసరం. ప్రజలకు కీలక సూచనలు: ప్రమాదాలను నివారించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ పలు హెచ్చరికలను జారీ చేసింది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదని, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపరులు ఉరుముల శబ్దం వినబడగానే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప సాధారణ ప్రజలు వర్షం కురిసే సమయంలో బయట తిరగవద్దని హెచ్చరించింది.