వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ఒక Energy ఉంటుంది. అలానే వంటగదిలోని ఉప్పు కేవలం రుచికి మాత్రమే కాదు, ఇంటి అదృష్టాన్ని మార్చే శక్తి కూడా దానికి ఉంది.
మనం ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవకపోవడం లేదా సుఖశాంతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో వాస్తులోని కొన్ని చిన్న చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందులో ఒకటి ఉప్పు డబ్బాలో 5 లవంగాలు ఉంచడం. ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి నట్టింట తాండవిస్తుంది.
ఈ ఉప్పును మీరు రోజూ వంటల్లో వాడుకోవచ్చు. ఒకవేళ లవంగాలు తేమతో మెత్తబడినా లేదా పాడైపోయినా, వాటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో వేసి మట్టి కప్పేయండి. తర్వాత మళ్లీ కొత్తగా 5 లవంగాలను పెట్టండి. ముఖ్యంగా, ఈ పరిహారం గురించి ఇతరులతో చర్చించకండి. దీన్ని రహస్యంగా ఉంచితేనే ఎక్కువ ప్రభావం ఉంటుందని నమ్మకం.