NFO: మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త ఫండ్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రస్తుతం 5 కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఉండగా మరొక స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (SIF) ఉన్నాయి.
ఈ ఫండ్స్ సబ్స్క్రిప్షన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి, తమ పోర్ట్ ఫోలియోల్లోని ఖాళీలను పూరించి ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫండ్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ వారం కొత్తగా లాంచ్ అయిన ఫండ్లలో హెచ్డీఎఫ్సీ, టాటా ఏఎంసీల నుంచి ఉన్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఇన్ఫినిటీ హైబ్రిడ్ లాంగ్-షార్ట్ ఫండ్ఇన్ఫినిటీ హైబ్రిడ్ లాంగ్- షార్ట్ ఫండ్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. కోటక్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఈ న్యూ ఫండ్ ఆఫర్ లాంచ్ అయింది. ఇప్పటికే ఈ స్కీమ్ సబ్స్క్రిప్షన్ మొదలవగా జూన్ 29వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.10 లక్షలుగా నిర్ణయించారు. లైఫ్ సైకిల్ ఫండ్స్జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి జెరోధా లైఫ్ సైకి ఫండ్ 2036 (Zerodha Life Cycle Fund 2036), జెరోధా లైఫ్ సైకిల్ ఫండ్ 2041 (Zerodha Life Cycle Fund 2041) లాంచ్ అయ్యాయి. ఈ ఫండ్స్ సబ్స్క్రిప్షన్ మొదలైంది. జులై 7, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించారు. హెచ్డీఎఫ్సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ హెచ్డీఎఫ్సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ (HDFC Nifty Auto Index Fund) అనేది ఒక ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే మొదలైంది. జులై 3వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించారు. టాటా మల్టీ సెక్టార్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి టాటా మల్టి సెక్టార్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ( Tata Multi Sector passive FoF ) లాంచ్ అయింది. ఇది ఒక డొమెస్టిక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఈ స్కీమ్ సబ్స్క్రిప్షన్ జులై 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. జేఎం మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్జేఎం మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ (JM Multi Asset Allocation Fund) అనేది ఒక మల్టీ అసెట్ అలకేషన్ సెక్టార్ ఫండ్, ఈ స్కీమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే మొదలైంది. జులై 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు.