
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న 'దేశీ గర్ల్' ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు గ్లోబల్ ఐకాన్‌గా మారింది.
నటిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆమె ఎదిగిన తీరు అద్భుతం. ఇటీవల 'కాన్ లయన్స్' (Cannes Lions) స్టేజీపై మాట్లాడిన ప్రియాంక, హాలీవుడ్లో తాను ఎదుర్కొన్న సవాళ్లు, హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి చేసిన పోరాటం గురించి మనసు విప్పి మాట్లాడారు.
సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ప్రియాంక, కొత్త ప్రతిభావంతులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. 'నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎవరూ తెలియదు. ఇప్పుడు కొత్తవాళ్లు సినిమా రంగంలోకి వస్తే, వారికి అండగా నిలబడాలన్నది నా కోరిక. నేను ఒక స్టేజీ నిర్మించాను, దాని ద్వారా ఇతరులు పైకి రావాలన్నదే నా ఆశయం' అని ఆమె తన సామాజిక బాధ్యతను తెలియజేశారు.