
ఎరువుల పంపిణీలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. APAIMS 2.0తో ఎరువుల అక్రమ మళ్లింపులకు పూర్తిగా చెక్ పెడుతున్నామన్నారు.
అమరావతి, జూన్ 26: ఎరువుల పంపిణీలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. APAIMS 2.0తో ఎరువుల అక్రమ మళ్లింపులకు పూర్తిగా చెక్ పెడుతున్నామన్నారు. నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. APAIMS 2.0 ద్వారా ఇప్పటివరకు 2.97 లక్షల మంది రైతులకు ఎరువులను పంపిణీ చేసినట్లు చెప్పారు. 48,588 మెట్రిక్ టన్నుల యూరియా, 12,874 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ జరిగిందన్నారు.
పంట, సాగు విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మేరకే ఎరువుల సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎరువుల నిల్వలు, సరఫరాపై రియల్‌టైమ్ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కౌలు రైతులతో సహా అర్హులైన ప్రతి రైతుకు సమాన అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఎరువుల సమస్యలపై టోల్ ఫ్రీ 155251కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ప్రారంభంలో వచ్చిన సాంకేతిక సమస్యల్లో అధిక భాగం పరిష్కరించినట్లు వెల్లడించారు. సబ్సిడీ ఎరువుల అక్రమాలకు APAIMS 2.0తో పూర్తిగా అడ్డుకట్ట వేస్తున్నామన్నారు.
రైతులను తప్పుదోవ పట్టించే దుష్ప్రచారాలను నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. టమాటా ధరలు పూర్తిగా పడిపోయాయన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. అధికారిక మార్కెట్ గణాంకాల ప్రకారం టమాటా ధరలు స్థిరంగానే ఉన్నాయన్నారు. జైన్ మ్యాంగో పల్ప్ యూనిట్‌పై జరుగుతున్న ప్రచారం కూడా అసత్యమే అని అన్నారు. రైతులు అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్
‘డ్రగ్స్ వద్దు బ్రో’.. యువతకు పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు