
చర్మాన్ని మెరిపించడానికి ఫేస్‌ప్యాక్‌లు మొదలైనవి వేసుకోవడం మనకు అలవాటే! అయితే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి వీటిని తయారు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో గుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
అరకప్పు పైనాపిల్ ముక్కలు, పావు కప్పు బొప్పాయి ముక్కలు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. తర్వాత అందులో అరచెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఓసారి, చల్లని నీటితో మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం కాస్త చల్లబడిన తర్వాత బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత మీ చర్మానికి నప్పే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా గిలక్కొట్టి, అందులో మెత్తగా చేసుకున్న అరచెంచా అవకాడో గుజ్జు, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంలోని తేమను అధిక సమయం నిలిపి ఉంచేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.
ముఖానికి ఇవి అప్లై చేసుకున్నాక ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి. లేదంటే ట్యాన్ ఏర్పడే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే వీటిని ప్రయత్నించే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.