తడి జుట్టుతో హెల్మెట్ అస్సలు పెట్టుకోవద్దు. ఇలా చేయడం వల్ల హెల్మెట్‌కు ఉన్న దుమ్ము,ధూళి కుదుళ్లకు చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయి. జుట్టు రాలుతుంది.
హెల్మెట్ పెట్టుకునే ముందు మీ జుట్టును సిల్క్ క్లాత్‌తో కప్పేయండి. ఇలా చేయడం వల్ల హెల్మెట్‌కు, జుట్టుకు మధ్య రాపిడి తగ్గుతుంది. జుట్టు రాలకుండా ఉంటుంది.
హెల్మెట్ తీసేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక యాంగిల్లో తీయకుండా స్ట్రెయిట్‌గా పైకి తీయండి. అలాగే ఒకేసారి పట్టి లాగడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. నెమ్మదిగా తీయడం బెటర్.
గంటలపాటు హెల్మెట్ పెట్టుకుంటే తలలో చెమట పెరిగి జుట్టు రాలడం సమస్య వస్తుంది. అందుకే కనీసం 20-30 నిమిషాలకు ఓసారి బ్రేక్ తీసుకుని హెల్మెట్ తీసేయండి.
హెల్మెట్ పెట్టుకునేవారు హెయిర్ కండిషనర్ ఉపయోగించడం చాలా మంచిది. షాంపూ చేశాక ఈ కండిషనర్ అప్లై చేసుకోండి. దీనివల్ల జుట్టు తేమగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కుదుళ్లు డ్రై అయిపోతాయి. మాయిశ్చరైజ్ చేసేందుకు ఏదైనా నూనెతో తలకు మర్దన చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది.
హెల్మెట్ పెట్టుకునే వారు వారానికి 4-5సార్లు తలస్నానం చేయడం మంచిది. తేలికపాటి పీహెచ్ బ్యాలెన్స్ షాంపూతో తలస్నానం చేస్తే కుదుళ్లు శుభ్రంగా ఉంటాయి. జుట్టు రాలకుండా ఉంటుంది.
హెల్మెట్ లోపల చెమట, మురికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి ఓసారి హెల్మెట్‌ను క్లీన్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
హెల్మెట్ టైట్‌గా పెట్టుకోవడం వల్ల కుదుళ్లపై రాపిడి పెరిగి జుట్టు రాలుతుంది. కాబట్టి హెల్మెట్ ఎప్పుడు కూడా కాస్త లూజ్‌గా పెట్టుకోవడం మంచిది.