బొప్పాయి పండ్లు తినడం ద్వారా ప్లేట్లెట్ కౌంట్ ఈజీగా పెరుగుతుంది. లేదంటే ప్లేట్లెట్ ఆకుల రసం తాగినా మంచి ఫలితం ఉంటుంది.
అందుకే డెంగీ జ్వరం ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
దానిమ్మ గింజల్లో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ మెరుగుపర్చడంతో పాటు ప్లేట్లెట్ల సంఖ్యను రెట్టింపు చేస్తాయి.
గుమ్మడికాయ, గుమ్మడి గింజల్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి ప్లేట్లెట్ కౌంట్ పెంచేందుకు సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి జ్వరం లాంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
కోడిగుడ్లలో విటమిన్ బి12 మెండుగా ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. అలాగే ప్లేట్లెట్ కౌంట్ పెరిగేందుకు సహాయపడుతుంది.
సాల్మోన్, ట్యూనా, సార్డైన్, మాకరెల్ లాంటి కొవ్వు చేపలు తినడం ద్వారా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఇవి రక్త కణాలతో పాటు ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతాయి.
గోధుమగడ్డి రసంలో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ప్లేట్లెట్ సంఖ్య పెంచడంలో సహాయపడుతుంది. అందుకే ఈ జ్యూస్ తాగడం చాలా మంచిది.
పాలకూర, మెంతికూర, మునగాకు, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ కె, ఐరన్ ఉంటాయి. ఇవి ప్లేట్లెట్ల సంఖ్యం పెరిగేందుకు సహాయపడతాయి.
నారింజ, బత్తాయి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ శోషణ పెంచుతుంది. దీంతో ప్లేట్లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, శనగలు, రాజ్మా, బొబ్బర్లు వంటి వాటిలో విటమిన్ బి (ఫోలేట్), ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. తద్వారా ప్లేట్లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.