
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం దొరకడమే గగనం. అలాంటిది గూగుల్, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ, ఏడాదికి రూ.4.25 కోట్ల జీతం అందుకుంటున్న ఓ వ్యక్తి..
ఆ ఉద్యోగాన్ని వదిలేసి రెస్టారెంట్ పెట్టుకున్నాడంటే నమ్మగలమా? కానీ ఇది నిజం. అమెరికాలోని టెక్సాస్‌లో సలాహుద్దీన్ అబ్దుల్-కఫీ అనే 35 ఏళ్ల వ్యక్తి ఈ సాహసం చేసి, ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.టెక్ ప్రపంచంపై విరక్తితో..దాదాపు 14 ఏళ్ల పాటు టెక్ పరిశ్రమలో పనిచేసిన అబ్దుల్-కఫీ, ఆ రంగంపై పూర్తి నిరాశకు గురయ్యాడు. టెక్ కంపెనీల ప్రధాన లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపరచడం కాకుండా, కేవలం డబ్బు సంపాదించడంపైనే ఉందని గ్రహించాడు. ఈ ధోరణి నచ్చకే శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేశాడు. జీతంలో ఏకంగా 50 శాతానికి పైగా కోతను అంగీకరించి, ఒక మతపరమైన స్వచ్ఛంద సంస్థలో చేరాడు.స్నేహితుల ప్రోత్సాహంతో వ్యాపారం ప్రారంభంస్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూనే, తనకిష్టమైన వంటపై దృష్టి పెట్టాడు. స్నేహితుల కోసం తరచూ ఇంట్లో విందులు, బార్బిక్యూ పార్టీలు ఏర్పాటు చేసేవాడు. ముఖ్యంగా అతను తయారుచేసే హలాల్ బ్రిస్కెట్స్ (ఒక రకమైన బార్బిక్యూ మాంసం) రుచి చూసిన స్నేహితులు, ఇంతకుముందెన్నడూ ఇలాంటి వంటకం తినలేదని ప్రశంసించేవారు. అప్పుడే అబ్దుల్-కఫీకి ఒక ఆలోచన వచ్చింది."టెక్సాస్ బార్బిక్యూలో లేని కొత్తదనాన్ని అందించగలనేమో అనిపించింది. స్నేహితులు నా వంటను మెచ్చుకుంటున్నప్పుడు, దీనికి మార్కెట్లో ఆదరణ ఉంటుందని నమ్మాను," అని అబ్దుల్-కఫీ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఆలోచనతోనే 2024