టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్‌కుమార్ రెడ్డి సొంత ఊరిలో సందడి చేశాడు. చాలా ఏళ్ల తర్వాత స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా, గాజువాకలోని తుంగ్లం వెళ్లాడు.
స్వస్థలానికి వెళ్లిన నితీష్‌కు కుటుంబసభ్యులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. నితీష్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.. చానాళ్లకు ఊరికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. తన బాల్యం మొత్తం ఊరిలోనే గడిచిందని.. తనకు గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నాడు. తాను క్రికెట్ రాణించడానికి, ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు పడిన కష్టం, వారి పాత్రను మర్చిపోలేనన్నాడు. తల్లిదండ్రులు కష్టపడటంతోనే తనకు ఐపీఎల్లో, టీమిండియాలో ఆడే అవకాశం వచ్చిందన్నారు. క్రికెట్లోకి విరాట్ కోహ్లీ స్ఫూర్తితో వచ్చానని.. టీమిండియాకు ఆడటం ఎంతో సంతోషానిచ్చిందన్నాడు. సొంత ఊరిలో నాన్నమ్మను నితీష్ కుమార్ రెడ్డి కలిశారు. టీమిండియాకు ఆడాలన్న నాన్నమ్మ కలను నెరవేర్చిన నితీష్.. ఆమెకు బంగారు గాజులు కానుకగా ఇచ్చారు. నితీష్ స్వయంగా నాన్నమ్మకు బంగారు గాజులు తొడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. నాన్నమ్మ కూడా నితీష్‌ను చూసి ఎంతో సంతోషించారు. అలాగే కుటుంబసభ్యులు, బంధువులు నితీష్‌తో సరదాగా గడిపారు. నితీష్‌కుమార్ రెడ్డి ఐపీఎల్‌కు ఎంపికైన తర్వాత తొలిసారి సొంత ఊరికి వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తం మీద నితీష్ రాకతో తుంగ్లంలో సందడి వాతావరణం కనిపించింది. నితీష్ గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు దూరమయ్యాడు. నితీష్‌కు ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతోంది.. నాలుగు నుంచి ఐదు వారాల్లో పూర్తిస్థాయిలో కోలుకుంటానని నితీష్ చెబుతున్నాడు.టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. నితీష్ స్థానంలో సూర్యాన్ష్ షెడ్గెను ఎంపిక చేశారు. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ సమయంలో నితీష్ గాయపడ్డాడు. ముందు చిన్న గాయమని భావించారు.. ఎమ్మారైలో తొడ కండరాలకు గాయమైనట్లు తేలింది. నితీష్ కోలుకునేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని డాక్టర్లు తేల్చారు. ఆ తర్వాత ఫిట్నెస్ నిరూపించుకోవడానికి సమయం పడుతుందంటున్నారు. ఐర్లాండ్ సిరీస్ నుంచి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా గాయంతో వైదొలిగిన సంగతి తెలిసిందే.