
బ్రిటన్ రాచకుటుంబ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను చెల్లించిన వ్యక్తిగత పన్నుల వివరాలను బహిరంగపరచి కింగ్ చార్లెస్ III సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఒక బ్రిటన్ రాజు తన సొంత పన్ను వివరాలను ఇలా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.గురువారం బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన వార్షిక ఆర్థిక నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 2022లో రాజుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కింగ్ చార్లెస్ రూ. 320 కోట్లకు పైగా (30 మిలియన్ పౌండ్లు) వ్యక్తిగత పన్నులు చెల్లించారు. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే ఆయన ఆదాయ, మూలధన లాభాల పన్నుల కింద దాదాపు రూ. 140 కోట్లు (12.9 మిలియన్ పౌండ్లు) కట్టారు. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే అత్యధిక పన్ను చెల్లించే టాప్ 100 మంది వ్యక్తుల జాబితాలో బ్రిటన్ రాజు నిలిచారు. ఇదే సమయంలో ప్రిన్స్ విలియం కూడా దాదాపు రూ. 84 కోట్ల (7.76 మిలియన్ పౌండ్లు) పన్ను చెల్లించినట్లు ప్రకటించారు.నిజానికి బ్రిటన్ చట్టాల ప్రకారం రాజులు ఆదాయ, వారసత్వ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. కానీ, తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II 1993లో నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కింగ్ చార్లెస్ స్వచ్ఛందంగా ఈ పన్నులు చెల్లించారు. ఈ వివరాలను ప్రజల ముందు ఉంచడం రాజు వ్యక్తిగత నిర్ణయమని ప్యాలెస్ అధికారులు తెలిపారు. చారిత్రాత్మక 'డచీ ఆఫ్ లాంకాస్టర్' తో పాటు శాండ్రింగ్‌హామ్, బాల్మోరల్ వంటి ప్రైవేట్ ఎస్టేట్ల ద్వారా వచ్చే ఆదాయంపై ఈ పన్నులు