
భారత్, యూకే మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం', అలాగే 'డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్' ఒప్పందాలు వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
వీటి ప్రాముఖ్యత గురించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 26: భారత్, యునైటెడ్ కింగ్డమ్ (UK) మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం' (CETA), అలాగే 'డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్'(DCC) ఒప్పందాలు జూలై 15 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ చరిత్రాత్మక పరిణామంతో ఇరు దేశాల మధ్య ఆవిష్కరణలు, పెట్టుబడులు, సమగ్ర వృద్ధి మరింత వేగవంతం కానున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. లండన్లో బ్రిటన్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ పీటర్ కైల్తో జరిగిన సమావేశం అనంతరం మంత్రి పీయూష్ గోయల్ ఈ వివరాలను 'X' వేదికగా పంచుకున్నారు.
'లండన్లో నా మిత్రుడు, బ్రిటన్ ప్రతినిధి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిగాయి. భారత్-బ్రిటన్ ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న కొత్త అవకాశాలను అన్వేషించాం. జూలై 15 నుంచి CETA, DCC ఒప్పందాలు అమలులోకి రానుండటంతో, ఇరు దేశాల్లో ఆవిష్కరణలు, పెట్టుబడులు, సంపూర్ణ వృద్ధిని పెంపొందించే పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నాం'. అని పీయూష్ గోయల్ వెల్లడించారు.
ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి: ఈ ఒప్పందం భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారీగా పెంచేందుకు దోహదపడుతుంది.
మార్కెట్ యాక్సెస్: ఇరు దేశాల వ్యాపారులకు మార్కెట్ లభ్యత సులభతరమవుతుంది.
వస్తువులు, సేవల సరఫరా: వస్తువులు, సేవల రంగంలో పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుంది.
2. DCC (డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్):
ఇది ఒక రకమైన సామాజిక భద్రతా ఒప్పందం. ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఇది ఒక పెద్ద ఉపశమనం కానుంది.
ఒకే దేశంలో సామాజిక భద్రత చెల్లింపులు: వ్యాపార రీత్యా లేదా ఉద్యోగ రీత్యా భారత్ నుంచి బ్రిటన్కు, అలాగే బ్రిటన్ నుంచి భారత్కు వెళ్లే ఉద్యోగులు, వారి యాజమాన్యాలు ఇకపై ఏదో ఒక దేశంలో మాత్రమే సామాజిక భద్రతా చెల్లింపులు(పీఎఫ్/నేషనల్ ఇన్స్యూరెన్స్) చేస్తే సరిపోతుంది. రెండు చోట్లా చెల్లించాల్సిన భారం తప్పుతుంది.
తాత్కాలిక ఉద్యోగులకు లబ్ధి: తాత్కాలిక ప్రాతిపదికన విదేశీ అసైన్మెంట్లపై వెళ్లే ఉద్యోగులు తమ స్వదేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థలోనే తమ సహకారాన్ని కొనసాగించవచ్చు. దీనివల్ల వారి సర్వీస్ రికార్డులకు లేదా ప్రయోజనాలకు ఎలాంటి అంతరాయం కలగదు.
మినహాయింపు కాలపరిమితి పెంపు: తాత్కాలికంగా విదేశాలకు వెళ్లే ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 52 వారాల మినహాయింపు పరిమితిని పరస్పరం 60 నెలల (5 సంవత్సరాల)కు పొడిగించనున్నారు.
ఈ ఒప్పందం కేవలం సామాజిక భద్రతా చెల్లింపులు సమన్వయానికి మాత్రమే వర్తిస్తుంది. స్టేట్ పెన్షన్ లేదా ఇతర ప్రస్తుత సామాజిక భద్రతా ప్రయోజనాల అర్హత నిబంధనలలో ఎలాంటి మార్పులు ఉండవు.
ఈ రెండు కీలక ఒప్పందాల అమలుతో భారత్-బ్రిటన్ దేశాల మధ్య వాణిజ్య బంధం ఓ సరికొత్త మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది కేంద్ర మంత్రి చెప్పారు.
సైబర్ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్ఐఆర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News