
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. సౌత్ సినిమాలలో మహిళలను చూసే కోణంలో పురుషాధిక్యత కనిపిస్తుందని కామెంట్స్ చేసింది.
Jun 26 2026 8:05 AM | Updated on Jun 26 2026 8:06 AM
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. సౌత్ సినిమాలలో మహిళలను చూసే కోణంలో పురుషాధిక్యత కనిపిస్తుందని కామెంట్స్ చేసింది. హీరోయిన్లను గౌరవప్రదంగా కాకుండా ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపిస్తారని విమర్శించింది. అయితే బాలీవుడ్లో మాత్రం నటన లేదా గ్లామర్ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సౌత్‌లో ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సి వస్తుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే ఈ ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా.. ఐటమ్ సాంగ్స్‌లో అప్పుడప్పుడు తెరపై సందడి చేస్తోంది. జైలర్ మూవీలో ప్రత్యేక సాంగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాటతో పాట మరిన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేశారు ముద్దుగుమ్మ. అలా తన అందాలతో ఆకట్టుకున్న బ్యూటీ తమన్నా.. ఐటం సాంగ్స్‌పై ఉన్న అభిప్రాయాన్న తప్పుబట్టింది. అలాంటి పాటలను ఐటెం సాంగ్స్ అనడాన్ని తనకు నచ్చడం లేదని అన్నారు. సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్‌ను ఐటమ్ సాంగ్స్ అనడం కరెక్ట్ కాదని తెలిపింది.
అలాంటి పదం మహిళలకు మర్యాదకరమైనది కాదని తమన్నా పేర్కొంది. ఆ ఒక్క పాట కోసం మేం ఎంత కష్టపడున్నామో అందరికీ తెలుసని తమన్నా అన్నారు. అలాంటి పాటను ఐటెం సాంగ్ అనడం వల్ల.. నటి శ్రమకు ఇచ్చే గౌరవం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ విధానంలో మార్పు రావాలి.. నటీమణులను గ్లామర్ డాల్స్‌గా చూడకుండా వారి నటనా ప్రతిభకు ప్రాముఖ్యత ఇవ్వాలని తమన్నా పేర్కొన్నారు.
అనంతపురం : ఘనంగా గూగూడు కుళ్లాయి స్వామి ఉత్సవాలు (ఫొటోలు)
గ్రాండ్‌గా ఖుష్బు కుమార్తె పెళ్లి వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)
మాటా వేడుకలో టాలీవుడ్ సినీతారల సందడి (ఫొటోలు)
మ్యాడ్ బ్యూటీ రెబా మోనికా జాన్ బేబీమూన్ ట్రిప్ (ఫొటోలు)
గ్రాండ్‌గా జబర్దస్త్ ఫైమా పెళ్లి వేడుక (ఫొటోలు)
సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు
సూపర్ ఎల్ నినో.. ఈ ప్రభావం 2027 వరకు వర్షాలు కష్టమే..!
పోరంకిలో టెన్షన్.. టెన్షన్.. దేవభక్తుని చక్రవర్తిపై దాడి
CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్
CI నాగరాజు గారు జైల్లో మీరు జాగ్రత.. ఎందుకు చెప్తున్నాను అంటే...!