
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) స్లీపర్ సెల్‌తో సంబంధాలు కలిగి ఉందనే ఆరోపణలపై జైపూర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
సదరు మహిళ పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాద కమాండర్‌ను వివాహం చేసుకోవడానికి నేపాల్ మీదుగా పాక్ వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చిన పక్కా సమాచారంతో జైపూర్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్న బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా అనే మహిళను ఏటీఎస్ గత వారం అదుపులోకి తీసుకుంది. ఆమెపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసి, ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారిస్తున్నారు.నిందితురాలి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఫోరెన్సిక్ పరిశీలన చేయగా, ఆమె మొబైల్లో పాకిస్థాన్ నంబర్లు ఉన్నట్లు తేలింది. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ సన్నిహిత బంధువు యూసుఫ్ అజహర్, అలాగే భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఖారీ జరార్కు సంబంధించిన నంబర్లు ఆమె కాంటాక్ట్స్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు అబు ఉబైదా అనే వ్యక్తితో ఆమె నిరంతరం చాటింగ్ చేస్తూ భావోద్వేగ బంధాన్ని పెంచుకుందని, అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని దర్యాప్తులో తేలింది.ఈ ఏడాది నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో నేపాల్, సౌదీ అరేబియా లేదా యూఏఈ మీదుగా పాకిస్థాన్ చేరుకోవడానికి బబిత ప్లాన్ చేసినట్లు ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితురాలైన ఆమె, తన పేరును