
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
EPFO: ఈపీఎఫ్ఓ సభ్యులకు ఆ సంస్థ పలు కీలక సూచనలు చేసింది. 3 రోజుల పాటు సేవలు తాత్కాలికంగా నిలిచినున్నట్లు వెల్లడించింది. పోర్టల్‌లో సాంకేతికపరమైన అప్ డేట్స్ చేపడుతున్న నేపథ్యంలో జూన్ 26వ తేదీ అర్థరాత్రి 12.00 గంటల నుంచి జూన్ 28వ తేదీ అర్థరాత్రి 11.59 నిమిషాల వరకు పోర్టల్ కు సంబంధించిన పలు సేవలు నిలిచిపోతాయని ఆ సంస్థ వెల్లడించింది. పోర్టల్ నిర్వహణా సంస్థ దీనికి సంబంధించి డేటా బేస్ ను తన ఆధీనంలోకి తీసుకుని పలు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయనున్నట్లు తెలిపింది.
వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసులు వేగంగా అందించేందుకే ఈ అప్ గ్రేడ్ చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అందువల్ల వినియోగదారులు ఈ పోర్టల్ సేవలు వాడాలనుకుంటే సేవలు నిలిచిపోకముందే వినియోగించుకోవాలని సూచించింది. పోర్టల్ తాత్కాలికంగా పనిచేయని రోజులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. అయితే అన్ని సేవలకు సమస్య ఉండదని.. కొన్ని సేవలు మాత్రం మూడు రోజుల పాటు నిలిచిపోతాయని పేర్కొంది. కొత్త క్లెయిమ్ రిక్వెస్ట్ ఫాంలు సమర్పించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్ సర్వీసెస్, మైగ్రేషన్ పీరియడ్ కు సంబంధించిన క్లెయిమ్స్ సమర్పించడం వంటివి నిలిచిపోవచ్చని తెలిపింది. అయితే మిగిలిన కొన్ని సేవలను పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని తెలిపింది.
అవి ఉమాంగ్ యాప్, ఎస్ ఎంఎస్, వాట్సాప్, మిస్డ్ కాల్ సర్వీసెస్ వంటివి వినియోగించుకోవచ్చని తెలిపింది. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాస్ బుక్, క్లెయిమ్ స్టేటస్ వంటివి చూసుకునే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీగా పీఎఫ్ విత్ డ్రా క్లెయిమ్ చేసుకోవాలనుకునేవారు జూన్ 15 అంటే ఈ రోజు అర్ధరాత్రి లోపే ఫాంలు సమర్పించాలని పేర్కొంది. త్వరలోనే ఈపీఎఫ్ఓలో ఏటీఎం విత్ డ్రా సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. అలాగే సభ్యులకు అకౌట్లోని డబ్బుపై వడ్డీ కూడా ఈ నెలలోనే జమ అయ్యే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.