హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసును పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడైన వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు అతని ఇద్దరు కుమారు
లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి రూ. 14.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు చెందిన క్యాష్ వ్యాన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్, మరో ఇద్దరు సిబ్బంది మరియు గన్‌మెన్‌తో కలిసి ఏటీఎంలలో నగదు నింపేందుకు వెళ్లాడు. ఐఎస్ సదన్‌లోని ఎస్బీఐ ఏటీఎం వద్ద సిబ్బంది నగదు జమ చేసేందుకు లోపలికి వెళ్లగా, వ్యాన్‌లో ఒంటరిగా ఉన్న శ్రీనివాస్ రూ. 17 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌తో పరారయ్యాడు.ఈ చోరీ కోసం శ్రీనివాస్ పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీనివాస్ వ్యాన్ నడుపుతుండగా, అతని పెద్ద కుమారుడు బైక్‌పై వెన్నంటి వచ్చాడు. నగదు బ్యాగ్‌తో వ్యాన్ దిగిన శ్రీనివాస్, తన కుమారుడితో కలిసి అక్కడి నుంచి ఉడాయించాడు. అనంతరం ఉప్పుగూడలో చిన్న కుమారుడిని కలిసి కొంత నగదు అందజేసి, ఓ క్యాబ్ ద్వారా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు, అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది నెలల క్రితమే