
నాలుగు నెలల క్రితం పుట్టిన పాప జాతకం గురించి ఎటువంటి భయాందోళన లేకుండా అడిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ ప్రశ్న ద్వారా పాఠకులకు ఓ విషయాన్ని చెప్పదలచుకున్నా.
మనిషి జీవితంలో రోజూ జాతకాన్ని చూపించుకోవాల్సిన పనిలేదు. నాలుగు సందర్భాల్లో మాత్రం తప్పకుండా జాతకం చూపించుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
పుట్టిన వెంటనే జాతకం ఎందుకు చూపించాలంటే.. బాలారిష్ట దోషాలు లేదా జాతకంలో ఉన్న దోషాలకు శాంతుల ద్వారా మొదటి 21 రోజుల్లో లేదా తొలి సంవత్సరం లోగా పరిహారాలు జరిపించుకోవడం వల్ల దోష నివృత్తి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఇటువంటి అవకాశం పుట్టిన వెంటనే జాతకం రాయించుకొని చూపించుకోవడం వల్ల కలుగుతుంది. ఇక రెండోది, వివాహానికి పూర్వం జాతకం చూపించుకోవాలి. వివాహానికి ముందు మీకు తెలిసిన జ్యోతిషుడి వద్ద జాతకాలు చూపించుకున్న వారికి సత్ఫలితాలు ఉంటాయి. ఇక మూడోది, మన జీవితంలో కష్టం ఎదురైనప్పుడో, ఏదైనా ఉద్యోగ, వైవాహిక, సంతానపరంగా, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా సమస్యలు ఉన్నాయనిపించినప్పుడూ జాతకాలను చూపించుకోవడం మంచిది. ఆ జాతకం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని శాస్త్రం చెబుతోంది. అలాగే, నాలుగోది, ఏదైనా శుభకార్యం (ఉదా: ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, వివాహం వంటివి) ఆచరించేటప్పుడు జాతకం చూపించుకోవాలి.
మీరు ఇచ్చిన వివరాల ప్రకారం.. మీ పాపది పునర్వసు నక్షత్రం, నాలుగో పాదం, కర్కాటక రాశి. మీ పాపది అదృష్ట జాతకం. లగ్నంలో చంద్రుడు స్వక్షేత్రం. దశమంలో శుక్రుడు, భాగ్యంలో రవి శుభ ఫలితాలను సూచిస్తోంది. ఈ పాప జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుకుంటుంది. తనకు ఉద్యోగ యోగం, ధనయోగం వంటివీ ఉన్నాయి. అయితే, మీ పాప జాతకంలో కుజ దోషం, కాలసర్ప దోషం, రాహు-కేతు దోషాలు ఉన్నాయి. వాక్ స్థానంలో కేతువు అష్టమ రాహు ప్రభావం వల్ల కొంత కోపం అధికంగా ఉంటాయి. తీవ్ర నిర్ణయాలూ తీసుకొనే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో కుజ దోషం, కుజ- రాహు సంధి దోష ప్రభావాల వల్ల ఈ పాపకు వివాహ సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అలాగే, చిన్నప్పుడు ఆరోగ్యం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందువల్ల ఈ పాపకి ఈ కింది పరిహారాలు పాటిస్తే దోష నివృత్తి జరిగి శుభఫలితాలు పొందగలరు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.