
ఇంటర్నెట్ డెస్క్ - తాజా సమాచారం: భారత బౌలర్ నందని శర్మ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. క్యాచ్ అండ్ బౌల్‌తో ఫెర్డోస్ (33)ను నందని పెవిలియన్‌కు చేర్చింది. దీంతో 59 పరుగుల వద్ద బంగ్లా రెండో వికెట్‌ను నష్టపోయింది. శోభనా మోస్తరీ (16*)తో కలిసి ఫెర్డోస్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించింది. ప్రస్తుతం బంగ్లా స్కోరు 9 ఓవర్లకు 59/2. క్రీజ్‌లో మోస్తరీతోపాటు నిగర్ ఉంది.
టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ రేణుకాకు తొలి వికెట్ దక్కింది. బంగ్లాదేశ్ ఓపెనర్ దిలారా అక్తర్ (4) పెవిలియన్‌కు చేరింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి బంతికి దిలారా షాట్ కొట్టగా.. డీప్ స్క్వేర్‌లోని శ్రీ చరణి క్యాచ్‌ను అందుకొంది. దీంతో 8 పరుగుల వద్ద బంగ్లా తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లా స్కోరు 3 ఓవర్లకు 12/1. క్రీజ్‌లో జురియా ఫెర్డోస్ (5*), మోస్తరి ఉన్నారు.
మహిళల ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్‌కు దక్షిణాఫ్రికా రూపంలో ఓటమి ఎదురైంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో గెలిస్తేనే భారత్‌కు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందని శర్మ
బంగ్లాదేశ్: దిలారా అక్తర్, జురియా ఫెర్డౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా (కెప్టెన్/వికెట్ కీపర్), శోభనా మోస్తరీ, రితు మోని, షోర్నా అక్తర్, రుబెయా ఖాన్, నహిద అక్తర్, షాంజిదా అక్తర్, మరుఫా అక్తర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ - రంగారెడ్డి రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఫొటోలు మీరూ చూసేయండి..