
INDW vs BANW, Women’s T20 World Cup 2026 Live Score Updates: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో గురువారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే తొలి మ్యాచ్ మాంచెస్టర్‌లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరిగే రెండో మ్యాచ్ బ్రిస్టల్‌లో రాత్రి 11 గంటలకు మొదలవుతుంది.
సెమీఫైనల్స్‌కు చేరాలంటే భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తమతమ మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. గ్రూప్ Aలోని మూడు జట్లు 3 మ్యాచ్‌ల నుంచి చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. టాప్-4 రేసు నుంచి నెదర్లాండ్స్ నిష్క్రమించింది.
టోర్నమెంట్ చరిత్రలో బంగ్లాదేశ్ ఎన్నడూ భారత్‌ను ఓడించలేదు. ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా, ఆ మూడుసార్లు కూడా భారతే విజయం సాధించింది.