పిల్లలకు నచ్చిన పండ్లతో ఫ్రూట్ సలాడ్ తయారు చేసి ఇవ్వొచ్చు. యాపిల్, ద్రాక్ష, అరటిపండ్లతో పండ్ల సలాడ్ చేసి పిల్లలకు ఇస్తే వారు ఇష్టంగా తింటారు. మొలకెత్తిన శనగలు లేదా పెసలతో చాట్ తయారు
చేసి పిల్లలకు ఇవ్వొచ్చు. మొలకల చాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అరటిపండ్లు, ఓట్స్‌తో బైట్స్ తయారు చేయవచ్చు. అరటిపండ్లు, ఓట్స్‌తో చేసిన బైట్స్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.
పిల్లలు స్వీట్ కార్న్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్వీట్ కార్న్‌ను ఉడికించి పిల్లలకు ఇవ్వండి.
పెరుగులో తాజా పండ్ల ముక్కలను కలిపి పిల్లలకు ఇవ్వండి. దీన్ని తినడం వల్ల పిల్లలకు పోషకాలు బాగా అందుతాయి.
రాగి జావలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రాగి జావ తినడం వల్ల ఐరన్, కాల్షియం బాగా అందుతాయి. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీకు నచ్చిన కూరగాయలన్నింటితో వెజిటేబుల్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. వెజిటేబుల్ శాండ్విచ్ తినడానికి రుచికరంగా ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్ మిక్స్‌ను కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ వేసి పిల్లలకు ఇవ్వండి.
ఉడికించిన చిలగడదుంపలను కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఉడికించిన చిలగడదుంపలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.