
పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ మృతి చెంది
Jun 25 2026 5:37 PM | Updated on Jun 25 2026 5:59 PM
పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ మృతి చెందిన ఘటనలో అరెస్ట్ అయిన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఎవరో తెలియకుండా, ఇద్దరూ తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం నిందితులిద్దరూ 'బ్లేమ్ గేమ్' ఆడుతున్నారు. సియా, చేతన్ ఇద్దరూ పక్కా ప్లాన్ ప్రకారం కేతన్‌ను నిర్దాక్షిణ్యంగా హత్య చేసి, ఇపుడు నేరాన్ని ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారు. తాను సియాతో కలిసి పారిపోవాలనుకున్నాను. కానీ కేతన్‌ను చంపమని సియానే ఒత్తిడి తెచ్చిందని చేతన్ మాట మారుస్తు న్నాడు. అటు సియా కూడా ఏం తక్కువ తినలేదు. అసలు ఈ హత్య ప్లాన్ అంతా చేతన్‌దే. జూన్ 14న జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు చేతన్ బోరున ఏడ్చాడు అంటూ సియా కొత్త నాటకానికి తీరతీసినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు!
అయితే పోలీసులు మాత్రం వారి ఎత్తులను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా బ్లేమ్ గేమ్ అనీ, వారి డిఫెన్స్ స్ట్రాటజీ (రక్షణ వ్యూహం) అని, కేతన్‌ను అంతం చేయాలనే కుట్రలో ఇద్దరూ సమానంగా భాగస్వాములని భావిస్తున్నారు.
ఈ హత్యలో దర్యాప్తులో కీలకాంశాలను పోలీసులు సేకరించారు. తద్వారా వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని, కుట్రను తేట తెల్లం చేస్తున్నారు. మే 31 నుండి జూన్ 4 మధ్య పుణేలోని ఒక కేఫ్‌లో వీరిద్దరూ సమావేశమైనట్లు పోలీసులకు తెలిసింది. ఈ భేటీలోనే హత్యకు సంబంధించిన ప్లాన్ సిద్ధం చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కెఫేలో వారు కలుసుకున్న వీడియో కూడా వెలుగులోకివచ్చింది.
సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డులు, వారి మధ్య జరిగిన సంభాషణలు ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ధృవీకరిస్తున్నాయి. జూన్ 14న కూడా కేతన్‌ను చంపడానికి ప్రయత్నించి వారు విఫలమయ్యారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కుట్రలో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్లో సిమ్రాన్ (ఫొటోలు)
భర్తతో కలిసి వేకేషన్లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు
నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)
షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)
ఎన్కౌంటర్ ప్రకంపనలు.. దేశవ్యాప్త ఉద్యమ హెచ్చరిక
కొడుకుపై పోలీసుల ఓవరాక్షన్.. దేవభక్తుని చక్రవర్తి తండ్రి వార్నింగ్
భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ.. కానీ ..!
నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరిన SIT బృందం