
వరుస భూకంపాల ధాటికి వెనిజులాలో ఇప్పటి వరకు 164 మంది చనిపోయినట్లు గుర్తించారు. మరో 971 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.
దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత వందేళ్లలో ఆ దేశాన్ని తాకిన అత్యంత శక్తిమంతమైన భూకంపాల్లో ఇవి ఒకటిగా నమోదయ్యాయి.రాజధాని కారకాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం సంభవించింది. ముఖ్యంగా లా గ్వైరా ప్రాంతం అత్యంత ప్రభావితమైంది. డజన్ల కొద్దీ భవనాలు నేలమట్టమవగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. రాష్ట్ర టెలివిజన్ ప్రసారం చేసిన దృశ్యాల్లో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఘటన కనిపించింది.భూకంపాల సమయంలో కారకాస్‌లో భవనాలు ఊగిపోవడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. పలుచోట్ల విద్యుత్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా నష్టం వాటిల్లడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో సేవలను నిలిపివేయగా, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.అమెరికా భూకంప పరిశోధనా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మొదటి భూకంపం కారకాస్‌కు పశ్చిమాన ఉన్న మోరాన్ సమీపంలో సంభవించగా, కేవలం నిమిషం వ్యవధిలోనే మరో భారీ భూకంపం నమోదైంది. ఈ ప్రకంపనలు బ్రెజిల్, కొలంబియా వరకు అనిపించాయి. విపత్తు తీవ్రత దృష్ట్యా అమెరికా, మెక్సికో, ఖతార్, ఎల్‌సాల్వడార్ సహా పలు దేశాలు సహాయక బృందాలు, వైద్య సాయం పంపుతున్నాయి. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని