
తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే), ప్రతిపక్ష డీఎంకే మధ్య పదునైన మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేసిన “మీ నాన్న ఎక్కడ?
తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే), ప్రతిపక్ష డీఎంకే మధ్య పదునైన మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేసిన “మీ నాన్న ఎక్కడ?” అనే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనానికి దారితీశాయి. ఈ వివాదాస్పద వ్యంగ్యాస్త్రాలకు కౌంటర్‌గా మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ త్వరలోనే తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెడతారని ఆ పార్టీ అగ్ర శ్రేణి నేతలు బలంగా సంకేతాలు ఇస్తున్నారు.తమిళనాడులో అపరిచితుడు తరహా వెబ్ సైట్-అవినీతిపై భారీ యుద్దం-విజయ్ ధీమా అదేనా? స్టాలిన్ టార్గెట్ గా విజయ్ దాడిగత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిని ముందుండి నడిపించిన ఎంకే స్టాలిన్, కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూశారు. దాంతో ఆయన చట్టసభకు దూరం కావలసి వచ్చింది. ప్రస్తుతం ఆయన కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్ష నేత తండ్రి సభలో లేరనే విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా ఒక నాటకీయ కథ రూపంలో విమర్శలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. నీట్ రద్దు, మీ హిందీ వద్దు- అసెంబ్లీలో కేంద్రానికి తేల్చేసిన విజయ్..!ఎంకే స్టాలిన్ రీఎంట్రీ?ముఖ్యమంత్రి విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై డీఎంకే సీనియర్ నేత, ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూ ఒక బహిరంగ సభలో అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మా శ్రేణులను రెచ్చగొట్టేలా మీ నాన్న ఎక్కడంటూ ప్రశ్నించారు. మా నాయకుడు స్టాలిన్ అతి త్వరలోనే అసెంబ్లీకి తిరిగి వస్తారు. ఆయన మళ్లీ సభలో అడుగుపెట్టి బాధ్యతలు స్వీకరించడం ఖాయం. నిన్నటివరకు మా క్యాడర్ అంతా ప్రశాంతంగా ఉన్నారు, కానీ విజయ్ వ్యాఖ్యల తర్వాత తమిళనాడు వ్యాప్తంగా స్టాలిన్ తిరిగి రావాలని పార్టీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు అని నెహ్రూ స్పష్టం చేశారు.అధికార కూటమిలోనూ అసంతృప్తిఈ సున్నితమైన రాజకీయ వివాదం క్రమంగా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై అధికార కూటమిలోని మిత్రపక్ష వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వంటి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, సభ మర్యాదను కాపాడాలని హితవు పలికారు. ఇందుకు ప్రతిగా ఉదయనిధి స్టాలిన్ కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విజయ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ పరోక్ష పోస్ట్ పెట్టడం మరింత చర్చకు దారితీసింది. ప్రస్తుతం తమిళనాడులో ఆరు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉండటంతో ఇక్కడ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానంతో పాటు, టీవీకే పార్టీలో చేరిన ఐదుగురు మాజీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే క్యాడర్ ఒత్తిడి మేరకు ఎంకే స్టాలిన్ ఉపఎన్నిక బరిలో నిలిచి సభలో అడుగుపెట్టే అవకాశం ఉంది.