
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Redmi K90 Ultra to Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి (Xiaomi) సబ్-బ్రాండ్ అయిన రెడ్మి (Redmi) గ్లోబల్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) విడుదలకు ఖరారైంది. వచ్చే వారం చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వైబో (Weibo) ద్వారా రెడ్మి ఈ సమాచారాన్ని వెల్లడించింది.. జూన్ 30వ తేదిన విడుదల చేయబోతున్నట్లు తెలిపింది..
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్.. Redmi K90 Ultra స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ (Qualcomm)కు చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) చిప్సెట్తో మార్కెట్లోకి విడుదల కాబోతోంది.. హెవీ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ఈ ప్రాసెసర్ అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.. గేమింగ్ ఆడే సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో సరికొత్త అప్‌గ్రేడెడ్ థర్మల్ మేనేజ్మెంట్ సొల్యూషన్‌ను కూడా అందిస్తోంది.. ఫోన్‌ను కూల్‌గా ఉంచేందుకు ఇందులో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ (కూలింగ్ ఫ్యాన్) కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
అద్భుతమైన డిస్ప్లే.. ఈ స్మార్ట్‌ఫోన్ లుక్‌తో పాటు డిజైన్ పరంగా చాలా క్లాసీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన సిల్వర్ కలర్ వేరియంట్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.. ఫోన్ వెనుక భాగంలో పెద్ద హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది చూడటానికి ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెడ్మి K90 మ్యాక్స్ (Redmi K90 Max) మోడల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే.. ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59-ఇంచుల 1.5K LTPS OLED డిస్ప్లే ఉండే అవకాశం ఉందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.
సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. రెడ్మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) స్మార్ట్‌ఫోన్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ అయిన్నట్లు కూడా తెలుస్తోంది.. దీని ప్రకారం.. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది.. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని సమాచారం. అలాగే వినియోగదారుల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని.. ఇందులో సరికొత్త అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ (Ultrasonic Fingerprint Scanner)ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
K90 సిరీస్‌లో మరో సంచలనం.. ఇప్పటికే రెడ్మి K90 సిరీస్‌లో బేస్ మోడల్‌తో పాటు రెడ్మి K90 ప్రో, రెడ్మి K90 మ్యాక్స్ వంటి మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. కాగా.. ఇప్పుడు రాబోతున్న అల్ట్రా మోడల్ సరికొత్త టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో పాటు పవర్ఫుల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సాంసంగ్, ఒప్పో వంటి బ్రాండ్ల ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. తొలుత జూన్ 30న చైనాలో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్.. ఆ తర్వాత త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ధరతో పాటు పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు వచ్చే వారం లాంచ్ ఈవెంట్లో అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.