
ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ అనగానే పచ్చని గ్రాస్ కోర్టులు, హోరాహోరీ మ్యాచ్‌లు గుర్తుకొస్తాయి. అయితే, ఈసారి ఆ అనుభూతికి ఒక సరికొత్త దేశీ రుచి తోడైంది.
జూన్ 29న ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో వింబుల్డన్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ టోర్నమెంట్ సంప్రదాయ రుచి అయిన 'స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్' ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కుల్ఫీ రూపంలో సందడి చేస్తోంది. వింబుల్డన్ చరిత్రలోనే తొలిసారిగా, ఢిల్లీకి చెందిన చారిత్రక కుల్ఫీ బ్రాండ్ 'కురేమల్'తో చేతులు కలిపి, ఒక ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ కుల్ఫీని భారత అభిమానుల కోసం విడుదల చేసింది.భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిఈ అనూహ్య భాగస్వామ్యం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వింబుల్డన్ టోర్నమెంట్‌కు అత్యధిక ప్రేక్షకులు ఉన్న దేశం భారత్. సుమారు 8.24 కోట్ల మంది భారతీయులు ఈ టోర్నమెంట్‌ను వీక్షిస్తుండటంతో భారత అభిమానులతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బ్రిటన్ క్రీడా వారసత్వానికి, భారతదేశ వేసవి సంప్రదాయానికి మధ్య వారధిగా ఈ కుల్ఫీని అభివర్ణిస్తున్నారు. జూన్ 23న ప్రారంభమైన ఈ ప్రత్యేక కుల్ఫీ అమ్మకాలు, వింబుల్డన్ మెన్స్ ఫైనల్ జరిగే జూలై 12 వరకు కొనసాగుతాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, బెంగాలీ మార్కెట్, హౌజ్ ఖాస్, చాందినీ చౌక్‌లలో ఉన్న నాలుగు కురేమల్ అవుట్లెట్లలో ఇది అందుబాటులో ఉంటుంది.పెరుగుతున్న భారతీయ అభిమానుల ఆసక్తిభారతీయుల ఆసక్తి కేవలం టీవీ వీక్షణకే పరిమితం కాలేదు.