
రైలులో కత్తితో సచిన్ రమేశ్ సువర్ణ, మృతుడు మయాంక్ లోహర్.. ముంబయి: ఇద్దరు ప్రయాణికుల మధ్య తలెత్తిన చిన్న గొడవ ముంబయి లోకల్ రైలులో ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.
అంధేరి - బోరీవలీ స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బయట భారీ వర్షం కురుస్తుండగా రైలు తలుపులు తెరిచి ఉంచాలని ఒకరు.. మూయాలని మరొకరు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదై తన బ్యాగులో నుంచి కత్తి తీసిన సచిన్ రమేశ్ సువర్ణ (30) ప్రయాణికులు అందరూ చూస్తుండగా మయాంక్ లోహర్ (22) అనే యువకుడిపై దాడికి దిగాడు. ఛాతీపై, పొట్టపై పలుమార్లు కత్తితో పొడవటంతో మయాంక్ రైలులోనే కుప్పకూలిపోయాడు. కత్తి చూపుతూ వీరంగం సృష్టించిన నిందితుడు బోరీవలీ స్టేషను వస్తుందనగా కిందికి దూకి పరారయ్యాడు. మయాంక్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 400 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.