
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు.
అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Samantha Announces Pregnant: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు ఒక సంతోషకరమైన వార్తను తెలియజేశారు. తాను తొలి బిడ్డకు తల్లి కాబోతున్నానని సమంత అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విడుదలైన ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
కొంతకాలంగా సమంత గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో మాట్లాడిన సమంత అన్ని ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం తన జీవితంలో చాలా సంతోషకరమైన దశ నడుస్తోందని ఆమె తెలిపారు.
సినిమా ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడుతూ, “నా ప్రస్తుత కమిట్మెంట్లు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం విరామం తీసుకోవాల్సి ఉంటుంది. మెటర్నిటీ లీవ్‌లోకి వెళ్తాను. ఆ తర్వాత మళ్లీ అభిమానుల కోసం కొత్త సినిమాలతో వస్తాను” అని సమంత చెప్పారు. ఆమె మాటలు విన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్ది రోజులలోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. సినిమా విజయంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషకరమైన వార్త రావడంతో సమంత భావోద్వేగానికి గురయ్యారు.
సమంత 2025 డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన సన్నిహిత వేడుకలో వీరి పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఈ జంట గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో కలిసి పనిచేసిన సమంత, రాజ్ నిడిమోరు తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమా కోసం కూడా కలిసి పని చేశారు. ఇటీవల జరిగిన వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ సందర్భంగా కూడా ఈ జంట కలిసి కనిపించడంతో వారి గురించి వార్తలు మరింతగా చర్చనీయాంశమయ్యాయి.
ప్రస్తుతం సమంత వెల్లడించిన ఈ శుభవార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే సమంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటంతో ఆమె అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఆమె ఆరోగ్యంగా ఉండాలని, కొత్త జీవితాన్ని సంతోషంగా ఆహ్వానించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.