
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CNG Pump Business: భారతీయ రహదారులపై సీఎన్జీ వెహికల్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరల కారణంగా చాలా మంది వాహనదారులు సీఎన్జీ వైపు మళ్లుతున్నారు. దీంతో పెట్రోల్, డీజీల్ ధరల నుంచి కొంతమేర ఉపశమనం కలిగిందని చెప్పాలి. అయితే మీరు మీ వెహికల్ ట్యాంక్ నింపినప్పుడు సీఎన్జీ పంప్ యజమానికి ఎంత కమిషన్ వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా. సీఎన్జీ స్టేషన్ బిజినెస్ లో లాభాలు స్థిరంగా ఉంటాయి. ప్రతి కిలోగ్రామ్ సీఎన్జీపై పంప్ యజమానికి ఎంత కమిషన్ వస్తుందో తెలుసుకుందాం.
దేశంలోని ఏ CNG స్టేషన్ లాభదాయకత అయినా సరే.. IGL, MGL, అదానీ గ్యాస్ వంటి చమురు.. గ్యాస్ పంపిణీ సంస్థలు నిర్ధారించిన డీలర్ మార్జిన్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే.. ప్రతి కిలోగ్రామ్ CNGకి, పంప్ యజమాని సగటున రూ. 3 నుండి రూ. 6 మధ్య కమీషన్ వస్తుంది. ఈ మార్జిన్ నగరాన్ని బట్టి.. ఆయా గ్యాస్ కంపెనీల వ్యాపార విధానాలను బట్టి మారుతుంది. ఈ మొత్తం తక్కువగా అనిపించినప్పటికీ.. లాభాల మార్జిన్ మాత్రం భారీగానే ఉంటుంది.
ఒక CNG పంపు మొత్తం వ్యాపారం అమ్మకాల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అంటే.. ఒక పంపు ఎంత ఎక్కువ గ్యాస్ అమ్ముతుందో.. దాని ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఒక CNG పంపు రద్దీగా ఉండే నగరం నడిబొడ్డున లేదా జాతీయ రహదారిపై ఉన్నట్లయితే.. అది ప్రతిరోజూ సుమారుగా 3,000 నుండి 5,000 కిలోల CNGని సులభంగా అమ్మగలదు. అంటే ఒక పంపు యజమాని ప్రతిరోజూ స్థూల లాభంగా రూ. 12,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది.
పంపు యజమానికి వచ్చే నిజమైన పొదుపు స్థూల లాభం కాదనే చెప్పాలి. ఎందుకంటే... ఒక CNG స్టేషన్‌ను 24/7 నడపడానికి అనేక ఖర్చులు ఉంటాయి. వీటిలో CNG కంప్రెసర్‌ను నడపడానికి అయ్యే భారీ విద్యుత్ బిల్లు, ఉద్యోగుల జీతాలు, యంత్రాల నిర్వహణ వంటి వాటితో పాటు మిగతా ఖర్చులు కూడా ఉంటాయి. ఈ ఖర్చులన్నింటినీ తీసివేసిన తర్వాత, ఒక CNG పంపు యజమాని నెలకు సుమారుగా రూ.100,000 నుండి రూ. 300,000 వరకు నికర లాభాన్ని పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.