
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమలో కొనసాగుతూ, మరపురాని పాటలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ గాయని సునీత (Singer Sunitha).
సినీరంగంతో పాటు సమాజంలోనూ మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వివక్షపై ఆమె తన గళాన్ని బలంగానే వినిపిస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ ఫెమినిజం(Feminism) గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఫెమినిజం పేరిట కొందరు వ్యాప్తిచేస్తున్న భావజాలాన్ని తాను అంగీకరించబోనని సునీత స్పష్టం చేశారు. ఫెమినిజం అంటే మహిళలు వేసుకొనే దుస్తులు, వారు రాత్రిపూట రోడ్లపై తిరగడంలాంటివి కాదన్నారు.
‘నా దృష్టిలో ఫెమినిజం అంటే సమానత్వం. నా చుట్టూ అందరూ పురుషులే ఉన్నా, ఓ మహిళగా నా అభిప్రాయాన్ని గౌరవించడంతో పాటు దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మహిళలను తెలివితక్కువ వారిగా చూడటం, వారిని తక్కువగా అంచనా వేయడాన్ని ప్రతిఘటించడమే నా ఫెమినిజం’ అని సునీత పేర్కొన్నారు.
‘మహిళలు, పురుషులు సమానులు కాదు. ఎందుకంటే వారు భిన్నమైన స్వభావం కలవారు. పురుషులకు ఉన్న శారీరక బలం మహిళలకు ఉండకపోవచ్చు. కానీ పురుషులు చేయలేని ఎన్నో పనులను మహిళలు చేయగలరు. సమానత్వం అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు. పరస్పర గౌరవం, అవకాశాల్లో సమానత్వం ఉండటం’ అని సునీత అభిప్రాయపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఇంటర్నెట్ డెస్క్: రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకుపైగా కలెక్షన్స్ తన ఖాతాలోవేసుకుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్’ ఈవెంట్‌ను నిర్వహించారు.