
ఇటీవలే వేసవి సెలవులు పూర్తి చేసుకుని బడి బాట పట్టారు విద్యార్థులు. అయితే తాజాగా విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది.
ఎల్లుండి జూన్ 26 మొహర్రం పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాలలకు అధికారికంగా సెలవు ప్రకటించాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.రేపు ఒక్కరోజు పాఠశాలలకు వెళ్తే ఆ తర్వాత మొహర్రం సందర్భంగా శుక్రవారం సెలవు లభించనుంది. ఇక మధ్యలో శనివారం ఒక్కరోజు పాఠశాలలు తెరుచుకోనుండగా మళ్లీ ఆదివారం జనరల్ హాలీడే ఉండనుంది. ఇక వారాంతంలో సెలవులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ లో ఎక్కడికైనా వెళ్లేందుకు.. తమకిష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ మేరకు ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకుంటున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 25 న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది.ఇక తెలంగాణలో పాఠశాలలు జూన్ 15 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరవాలని భావించింది. అయితే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14 న ఆదివారం.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కారణంగా జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాంతో ఈ ఏడాది వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 14 తో ముగిశాయి. అయితే ఇంతలోనే మరోసారి స్కూళ్లకు హాలీడే రావడంతో అటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.