
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది
Jun 24 2026 3:52 PM | Updated on Jun 24 2026 3:55 PM
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవని.. కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినపడుతున్నాయి.. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘పీసీసీ చీఫ్‌కు ఎసరు పెడుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైతుబంధుకు వీళ్ళు ఇచ్చిన నిధుల కంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి తేలిపోయింది. వారం రోజులు తిట్టుకుని ఇప్పుడు డ్యూయెట్లు పాడుతున్నారు. బీఆర్ఎస్ రాదనే కాంగ్రెస్ వాళ్లు.. కేటీఆర్ పర్యటనలకు ఎందుకు భయపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా పని చేస్తున్నారా...?. తెలంగాణ హైబ్రిడ్ సీఎం మోదీ జట్టు అని ఖాయమైంది. రైతులకు 30 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది. భట్టి శాఖలో జరుగుతున్న వెయ్యి కోట్ల అవినీతిపై విచారణ జరపాలి
..జాతీయ బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసి భయపెడుతున్నారు. చంద్రబాబు,మోదీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం రాష్ట్రంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తే కేంద్ర మంత్రి ఇతర కేంద్ర మంత్రులను కలిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వాళ్ళ శరీరం నిర్మాణం అయ్యింది తెలంగాణ తిండితో.. బీజేపీ, రేవంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి అందుతున్న నాటకాలు. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్స్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్
కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు)
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)
టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్ అట్రాక్షన్‌గా తిలక్ వర్మ (ఫొటోలు)
తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు)
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా 17 మంది
వచ్చే నెల 29న వినతి పాదయాత్ర చేస్తున్నాను: Ambati
ఓబుల్ రెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన YS జగన్
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం ..