
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రెండున్నారేళ్ల పాలనా కాలం పూర్తి చేసుకున్న సీఎం రేవంత్.. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ గా కొత్త కార్యాచరణతో సిద్దం అవుతున్నారు. అటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ సైతం కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ సమయంలోనే మరో సారి సీఎం రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.తెలంగాణ లో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య రాజకీయం హోరా హోరీగా సాగుతోంది. ఢిల్లీ పర్యటన లో సీఎం రేవంత్ మెట్రో పైన కేంద్ర మంత్రులతో కీలక చర్చలు చేసారు. SIR అప్రమత్తత పైన పార్టీ నేతలు హెచ్చరికలు చేసారు. బీఆర్ఎస్ లక్ష్యంగా త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కాగా, సీఎం రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని.. రెన్యువల్‌ సీఎం అని సెటైర్లు వేశారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ గెలిస్తే రాష్ట్రం ఆగమవుతుందని కేసీఆర్‌ అనాడే చెప్పారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమితో రాష్ట్రం నష్టపోయిందని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌‌రెడ్డి 72సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. సత్తుపల్లిలో కేటీఆర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏవర్గాన్ని వదిలిపెట్టకుండా కాంగ్రెస్ సర్కార్ వేధిస్తోందని ధ్వజమెత్తారు.చర్లపల్లి నుంచి తిరుపతికి మరో రైలు- రూట్, షెడ్యూల్..!!మళ్లీ అధికారంలోకి వస్తాంమున్సిపల్ ఎన్నికల్లో కల్లూరు మున్సిపాల్టీ బీఆర్ఎస్ గెలిచేదని.. సత్తుపల్లిలో కూడా స్వల్ప ఓట్లతో ఈ స్థానం చేజార్చుకున్నామని తెలిపారు. ఆయా ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే పార్టీ శ్రేణులు పొంగిపోకూడదని.. ఓడితే కృంగిపోకూడదని పేర్కొన్నారు. తెలంగాణ మారుమూల‌ ప్రాంతాలు ఎక్కడకు వెళ్లినా దుర్మార్గపు కాంగ్రెస్ పాలన పోవాలని.. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ హయాంలోని మొదటి పదేళ్లు పునాది రాళ్లు వేసుకున్నామని వివరించారు. రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ రావాలని ప్రజలే అంటున్నారని తెలిపారు. అన్నదాతలకు రైతుబంధు పూర్తిగా చేయకుండా వేధిస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనూ రేవంత్‌రెడ్డి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.