
వాట్సప్‌నకు మెటా (Meta) మాతృ సంస్థ. మెసేజింగ్ యాప్‌నకు ప్రధాన మార్కెట్లుగా ఉన్న భారత్, బ్రెజిల్, మెక్సికో నుంచి కొత్త సీఈఓను ఎంచుకోవాలని మెటా భావించింది.
దానిలో భాగంగా ఆ సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న క్రిస్కాక్స్ కొత్తబాస్‌ను వెతికే ప్రయత్నాల్లో భాగంగా ఆ దేశాల్లో ఉన్న వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో మాట్లాడారు. పలువురికి కోల్డ్ మెయిల్స్ పంపారు. వాట్సప్ భవిష్యత్తు ఆలోచనలను సేకరించేందుకు, తదుపరి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను గుర్తించేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు క్రిస్కాక్స్ వెల్లడించారు. అలా ఆయన మెయిల్ చేసిన వారిలో కునాల్ కూడా ఒకరు.
‘‘కునాల్ (Kunal Shah) ఆలోచనలు గొప్పగా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందామా అని అడిగాను. ఆ తర్వాత మూడు నెలల పాటు నియామక ప్రక్రియ జరిగింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఇతర సీనియర్లతో సమావేశాలు జరిగాయి. వినియోగదారులు, డిజిటల్ వ్యాపారంపై ఆయనకున్న అవగాహన వాట్సప్ భవిష్యత్ వృద్ధికి ఉపయోగపడుతుందని నమ్మకం కుదిరింది’’ అని క్రిస్ వెల్లడించారు. కోల్డ్ ఈమెయిల్ అంటే.. ఇంతకుముందు పరిచయం లేనివ్యక్తికి ప్రొఫెషనల్ డిస్కషన్ కోసం పంపే మెయిల్. ఆ వ్యక్తి ఒక ఇన్వెస్టర్ కావొచ్చు. బిజినెస్ పార్టనర్, క్లయింట్ కూడా అయ్యుండొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.